శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో హైగ్రేడ్ గంజాయి భారీగా పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) అధికారులు గుర్తించారు. నిందితులు విమానం దిగిన వెంటనే డీఆర్ఎ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని నిలువరించి లగేజీ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. నిందితులు అత్యంత చాకచక్యంగా వాటర్ బాటిల్స్, స్నాక్ టిన్స్, ఫుడ్ బాక్సుల్లో హైగ్రేడ్ గంజాయిని ప్యాక్ చేసి స్మగ్లింగ్ కు ప్రయత్నించారు. మొత్తం 8.705 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఎ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.3.05 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు.. ఇద్దరు నిందితులను ఎన్టీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న డ్రగ్స్ నెట్వర్క్, ఇతర సంబంధాలపైనా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు, బంగారం వంటి విలువైన వస్తువులు తరలిస్తూ స్మగ్లర్లు భారీగా పట్టుపడుతున్నారు.

——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *