– కోనేరులో పడి ముగ్గురు బాలల మృతి
జగిత్యాల, ప్రజాతంత్ర, మే 20: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శివగంగ ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో ఆడుకునేందుకు ఆలయం వద్దకు వెళ్లిన చిన్నారులు అనంతరం ఈత కొట్టేందుకు కోనేరులోకి దిగారు. అయితే ఈత రాకపోవడంతో వారు నీటిలో మునిగిపోయారు. కాపాడాలంటూ కేకలు వేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కోనేరులో నుంచి వారిని బయటకు తీశారు. ముగ్గురినీ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ హాస్పిటల్కు తరలించగా వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. భారతి-భూషణం దంపతుల పిల్లలు మన్వీత్, మనస్వి కాగా భార్గవి-శేఖర్ కుమారుడు షార్వింద్. చిన్నారుల మృతితో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



