దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ వివరాలను ఆ సంస్థలు దిల్లీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు . దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలంపైగా అధికారంలో ఉన్న ఆప్కు ఈ సారి భంగపాటు కలిగి, అధికారానికి 27 ఏళ్లు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్టిట్ పోల్లో వెల్లడైంది. జాతీయ రాజకీయాలకు గుండెకాయ లాంటి దిల్లీ ఎన్నికలను అంచనా వేయడానికి గత నెల రోజులుగా ట్రాకర్ పోల్స్ నిర్వహిస్తున్న పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు ఎన్నికలు జరిగిన ఫిబ్రవరి 5వ తేదీన ఎగ్జిట్ పోల్ చేపట్టింది. బీజేపీ 51 -60 స్థానాలు, ఆప్ 10 -19 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్లో తేలింది. దిల్లీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వొచ్చే అవకాశం లేదని వెల్లడయినట్లు ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు తెలిపారు.
బీజేపీకి జై కొట్టిన దిల్లీ వోటర్లు
