– యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి
– విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు బాధ్యులెవరు
– మరోమారు సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూదిల్లీ, మే29: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యం త్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని కేం ద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి సంఘటన వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసి క క్షోభను కలిగిస్తుందని, వారిని ఇలా నిరాశ పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటి వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాస నానికి వెల్లడించారు. పరిస్థితిని ప్రధానమం త్రి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని చె ప్పారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్ – యూజీ పరీక్ష కోసం కొత్త యంత్రాం గాలను ఏర్పాటు చేశా మన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిస్పం దన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. నీట్ పేపర్ లీక్ ఉదం తంపై విచారణ చేపట్టిన సు ప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై (ఎ న్టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా తా వ్యవస్థలు, కమి కమిటీ లు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. యూపీఎస్సీలో ఇ లాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగుచూడలేద ని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. యూపీ ఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్డీఏకు సూచించింది. నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్రం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్ డా. రాధాకృష్ణన్ కూడా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎన్టీఏ, డా. రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్లను సర్వో న్నత న్యాయస్థానం పరిశీలించింది. కేంద్రం తన ఎఫిడవిట్ దాఖలు చేసేందుకు న్యాయ స్థానం అదనపు గడువు ఇచ్చింది. ఈ సంద ర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నరసింహ మాట్లా డుతూ పేపర్ లీక్ కు ఆస్కారం కల్పించిన పరిస్థితులు ఏమిటని డా. రాధాకృష్ణన్ను కో ర్టు ప్రశ్నించారు. గతంలో అనేక రక్షణలను ఏర్పాటు చేసినా పేపర్ లీక్ ఎలా అయ్యిందని అన్నారు. ఇందుకు డా. రాధాకృష్ణన్ బదులి స్తూ పేపర్ సెట్టింగ్ పక్రియలో సమస్య ఉం దని అన్నారు. ప్రస్తుతం ఆ లోపాలను సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా గతంలో మొత్తం 101 సూచన లు చేశామని చెప్పారు. వాటిల్లో 60 తాత్కా లిక సూచనలను 2025-26 పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు చెప్పారు. ఇతర మార్గదర్శకాలు కూడా త్వరలో పూర్తిస్థాయి లో అమలవుతాయని చెప్పారు. మరోసారి ఇలాంటివి జరగవని ధీమా వ్యక్తం చేశారు. సంస్కరణలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం సంస్కరణలతో పరిస్థితి చక్కబడదని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పు జరిగినప్పుడు బాధ్యత ఎవరిదనే దానిపై స్పష్టత ఉండాలని పేర్కొంది. బాధ్యత ఎవరు తీసుకుంటారనేది. తేల్చకుండా ఎన్ని కమిటీలు, టింగ్లు ఏర్పా టు చేసిన ఫలితం ఉండదని వ్యాఖ్యానించింది. ఇక ఈ అంశంపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ పేపర్ లీక్పై విచారణ జరుగుతోందని అన్నారు. జూన్ 21 నాటి పరీక్ష నిర్వహణ కోసం కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందని చెప్పా రు. ప్రధాని స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షి స్తున్నారని కోర్టుకు తెలిపారు.
దోషులను కఠినంగా శిక్షించి తీరుతాం : విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర 
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రం లీక్ అయిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానఅంగీకరించారు. పేపర్ లీక్‌లో ప్రమేయం ఉన్న వారెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన అన్ని కేసులను ఫాస్ట్-ట్రాక్ కోర్టులలో విచారిస్తామని, తద్వారా నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఫెయిల్ అయిందన్నారు. ఓ జాతీయ మీడియా టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని అంగీకరిస్తున్నాను.. ఎన్‌టీఏ విఫలమైంది.. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాన’ని అన్నారు. వైద్య ప్రవేశ పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తున్న విద్యా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడానికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. పేపర్ లీకేజీలో పాలుపంచుకున్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపైనా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. సీబీఎసఈ మూల్యాంకన వ్యవస్థలో ఓఎస్‌ఎంకు సంబంధించిన సాంకేతిక సమస్యలు సహా పలు సమస్యలు ఉన్నాయని అంగీకరించిన ఆయన వాటిని ప్రస్తుతం ఐఐటీ నిపుణుల సహాయంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీబీఎసఈ ఉపయోగించే పేమెంట్ గేట్‌వే విదేశీ హ్యాకర్ల సైబర్ దాడికి గురైందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించి, వ్యవస్థను బలోపేతం చేయడంలో సీబీఐ సైబర్ బృందం సీబీఎసఈకి సహకరిస్తోందని తెలిపారు. 11 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇప్పటికే తమ జవాబు పత్రాల కాపీలను పొందగా నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని, పక్రియను మెరుగుపరచడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





