వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: గ్రామీణ ప్రాంతం పేద ప్రజలకు న్యూరో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదిత్య న్యూరో ఆసుపత్రిని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో మానసిక ఒత్తిడితో నరాల బలహీనతతో అనేక న్యూరో సమస్యలతో ప్రజలు చనిపోతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో న్యూరో ఆసుపత్రి రావడం నరాలు గుండె మొదలగు వ్యాధులకు చికిత్సలు అందించేందుకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉందని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది డాక్టర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.