సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

  • ద‌వాఖాన‌ల్లో త‌గిన‌న్ని మందుల‌ను అందుబాటులో ఉంచాలి..
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించ‌కుండా పీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ  అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయంలో సీజనల్ వ్యాధుల నిర్మూలన, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా బలోపేతం చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ పీహెచ్‌సీల్లో వైద్య‌ సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు.  తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా బలోపేతం చేయడానికి అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.

రాష్ట్రంలో అన్ని బోధన హాస్పిట‌ళ్ల‌లో ఉన్న ప‌డ‌క‌ల‌ సామర్థ్యం పెంపుపై చర్చించారు. వీటితోపాటు పొరుగు సేవలను అందించే ఏజెన్సీల పనితీరుపై మంత్రికి చర్చించారు. బోధన ద‌వాఖాన‌ల్లో ఏజెన్సీ లు, వాళ్లకి చెల్లించే పేమెంట్లు , కోర్టు కేసుల సత్వర పరిష్కారం మార్గాలను అన్వేషించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభించే నర్సింగ్ కళాశాలల ఏర్పాట్లు, ట్రాన్స్ జెండర్ల క్లినిక్ లు, కొత్తగా 108, 102 అంబులెన్స్‌ సేవలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

డైరెక్టర్ హెల్త్, పరిధిలోని బోధన హాస్పిట‌ళ్ల‌లో  డాక్టర్ల నియామకాల పై మంత్రి దామోదర్ రాజనర్సింహా చర్చించారు. ఈ సమీక్షలో ఉస్మానియా, గాంధీ ద‌వాఖాన‌ల్లో బెడ్ల (పడకల) సామర్థ్యం పై చర్చించారు.  ఐవీఎఫ్‌ సెంటర్ సేవలను విస్తృతం చేయాల‌ని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వి కర్ణన్, టిజి ఎంఎస్ ఐడీసీ ఎండి హేమంత్ వాసుదేవరావు,  డీఎంఈ డాక్టర్ వాణీ, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డిప్యూటీ డీఎంఐ విమల థామస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page