special Stories

special Stories

వైద్య రంగానికి ఊతం… పారదర్శకతతోనే పేదలకు హితం!

తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదించిన ₹4,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ (టీజీ ఎస్వీఏఎస్టీహెచ్) రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం లక్ష్యంగా ‘తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్…

ఒక భావ‌జాలానికి లొంగిపోయిన పెంగ్విన్‌!

‘జెన్-జెడ్’ తరం వారు తమను దూషించారని చిన్నపిల్లల్లా ఫిర్యాదు చేసే చాలా మంది రాజకీయ నాయకులు, హుందాతనం మరియు ఆప్యాయత కలిగిన ఈ మహిళను తాము ఎంతగా దూషించారో తమ జ్ఞాపకాల నుండి అల‌వోక‌గా చెరిపేసుకుంటారు. దేశ కోడలిని “50 కోట్ల విలువైన గర్ల్‌ఫ్రెండ్” అని, “బార్-డాన్సర్” అని పిలవడం ద్వారా ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఆ…

ఇంకెక్కడి సయోధ్య? మేక చన్నుగా యాజమాన్య బోర్డులు?

“రెండు తెలుగు రాష్ట్రాలు సోదర రాష్ట్రాలుగా మెలగ వలసి వుండగా తీవ్ర మైన పొర పచ్చాలు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియమించిన గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు కేవలం మేక చన్నులుగా తయారైనవి. అవి క్రియాశీలంగా పని చేసే విధంగా జల శక్తి…

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌:  పార్టీపై ప‌ట్టు నిలుపుకున్న రేవంత్‌!!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన  పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా…

నాడు పంజరంలో పక్షులు… నేడు సర్కారుపైనే సవాళ్లా?

“నాడు అణచివేత, భయం ముందర మోకరిల్లి, పంజరంలో పక్షుల్లా మౌనం వహించిన కొందరు ఉద్యోగ నేతలు, నేడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై “బెదిరింపు ధోరణి” ప్రదర్శించడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి?” అణచివేతపై నిశ్శబ్దం… స్వేచ్ఛపై సమరమా? స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ  ఉన్నతమైన లక్షణం. కానీ, అదే స్వేచ్ఛను…

రోహిణి కమిషన్: ఆరేళ్ల విచారణ… మూడేళ్లుగా మౌనం!

“రోహిణి కమిషన్ ప్రయాణమే ఈ అంశం ఎంత క్లిష్టమైనదో తెలియజేస్తుంది.మొదట స్వల్ప వ్యవధిలో నివేదిక ఇవ్వాల్సిన కమిషన్ గడువు పదేపదే పొడిగించబడింది. మొత్తం 14 సార్లు గడువు పొడిగించినట్లు సమాచారం.చివరకు దాదాపు ఆరేళ్ల అనంతరం, 2023 జూలై 31న జస్టిస్ రోహిణి తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.కానీ నివేదిక సమర్పణతో సమస్య పరిష్కారం…

వందన్నది వెయ్యయినా సున్నేనా?!

“అప్పటికి అధికారంలో ఉన్నవారి మీద వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి దోహదం చేసినవి ఆ పార్టీ చేసిన వాగ్దానాలుకూడా. ఎన్నికల ప్రణాళికలోనూ, ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రమంతటా ఎన్నోచోట్ల కాంగ్రెస్ అగ్రనాయకుల దగ్గరినుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి,మంత్రుల దాకా ఎందరో ప్రకటించిన వాగ్దానాలున్నాయి. వాటిలో ఆరు గ్యారంటీలు ప్రధానమైనవి. ఆ ఆరు హామీలకు తాను…

మనిషి పక్షాన నిలిచిన సాహిత్యకారుడు

చెమ్మ : వారాల ఆనంద్ సాహిత్యం సమాజానికి అద్దంలాంటిది అంటారు. కొలకలూరి ఇనాక్ ఆ అద్దంలో బయటకు కనిపించని అనేకముఖాలను చూపించిన రచయిత. ప్రధాన స్రవంతికి దూరంగా ఊరు అంచులకు సమాజం అట్టడుగుక్కి  నెట్టివేసిన మనుషుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకున్నారు. వారిశ్రమలోని గౌరవాన్ని, బాధలోని మానవత్వాన్ని, అవమానంలో దాగిన ఆత్మగౌరవాన్ని తన సృజనాత్మక సాహిత్యకేంద్రంగా…

వేఱిమి!-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “దేవుడి ప్రసాదం తింటే?” చిన్ను అడిగాడు, చదవాల్సిన పుస్తకం ముందు పెట్టుకొని. ‘అదేం ప్రశ్న?’ అని వాళ్ళ అక్క అనలేదు. “పుణ్యం వస్తుంది” అని చెప్పింది, హోమ్ వర్క్ పూర్తిచేసినట్టు బుక్స్ బేగులో సర్దుతూ. “పుణ్యం అంటే?” మళ్ళీ అడిగాడు చిన్ను. “అంటే… ప్రసాదం తిన్నవారికి మంచి జరుగుతుంది” చెప్పింది అక్క. “ఎవరికైనా…

సినిమా అక్షర పరిమితులను అధిగమించిన సార్వత్రిక దృశ్య తత్త్వశాస్త్రం డి. జైరాం

సాహిత్యచరిత్రను లోతుగా పరిశీలిస్తే, మనుషులు ఎల్లప్పుడూ భాష ద్వారా సాధ్యమైనంత ఎక్కువ అనుభూతిని వ్యక్తపరచడానికే ప్రయత్నించారు. అయితే అక్షరానికి సహజమైన పరిమితి ఉంది. అది కాలానికి అనుగుణంగా మాత్రమే ప్రవహిస్తుంది. అంటే ఒకవాక్యం తర్వాతే మరోవాక్యం చదవాలి. కానీ మానవ మేధస్సు, భావోద్వేగాలు ఒకేక్షణంలో ఎన్నోకోణాలను స్పృశిస్తాయి. సినిమా ఈ అక్షర పరిమితిని “మోంటేజ్” (దృశ్యాల…