“ఆంధ్ర ప్రాంతపు లారీ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుందని ఆంధ్ర పెత్తం దారులు, పాలకులు కుట్రలు చేసి అడ్డుకున్నారు, అడ్డుకుంటున్నారు. చిత్రంగా అనేకమార్లు జనగామ, డోర్నకల్ నుండి మిర్యాలగూడెం రైలు మార్గమని కూడా ప్రచారం చేశారు. నిధులు కేటాయించి సర్వేలు కూడా చేశారు. అంతా ఎండమావిగానే మిగిలింది.”
పాలకుల వాగ్దానాలు గురి తప్పుతున్నాయి. ఫలితంగా ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతున్నది. కొత్తగా ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణ సూర్యాపేట జిల్లా మీదుగా రైలు మార్గ ప్రకటన.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్ర రాజధాని అమరావతి ( వ్యాపార వాణిజ్య కేంద్రం విజయవాడ ) కలిపే జాతీయ రహదారి 65( పాతది రహదారి 9) మధ్యలో ఉన్న సుదీర్ఘ చరిత్ర గల ప్రాంతం సూర్యాపేట. ఈ పట్టణం రెండు నగరాలకు సరిగా మధ్యలో తిన్నగా ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణాలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ సూర్యాపేట లోనే ఉండేది . నల్లచెరువు, సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువు మధ్యలో ఆహ్లాద వాతావరణంలో ఉన్నది. నదీ జలాలు పారకుండానే సమృద్ధిగల పంటలతో అలరారిన ప్రాంతం. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తంలోనే తాగు, సాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతికిన ప్రాంతం ఇది. చరిత్ర ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి, నాగులపాడు శివాలయాలు ఇక్కడే ఉన్నాయి. దురాజ్పల్లి దగ్గరలోని ఉండ్రుగొండ లో చారిత్రాత్మక నరసింహ స్వామి ఆలయం ఉంది. సమీపంలోని మూసి ప్రాజెక్టు ఒకప్పుడు సుందరమైనది. 14 /15 భారీ రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియాఖండం లోనే రెండవ అతిపెద్ద జాతర దురాజ్ పల్లి (సూర్యాపేట) లోనే జరుగుతుంది.
ఈ జాతీయ రహదారి ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాదుకు బస్సులు ప్రయాణికులకు, లారీలు ట్రాన్స్పోర్ట్ కు దగ్గర దారిగా ఉన్నది. అందుకే ఇది ఎప్పుడు రద్దీగా ఉన్నప్పటికీ ఒకప్పుడు డీలక్స్, గరుడ బస్సులన్నింటికీ సూర్యాపేట బస్టాండ్ మాత్రమే స్టాప్ గా ఉండేది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాలకులు అనేకమార్లు రైలు మార్గం వెయ్యాలని సమాలోచనలు చేశారు, ప్రతిపాదించారు. శరవేగంగా అభివృద్ధి చెండుతున్న చౌటుప్పల్,చిట్యాల,నార్కెట్పల్
ఆంధ్ర ప్రాంతపు లారీ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుందని ఆంధ్ర పెత్తం దారులు, పాలకులు కుట్రలు చేసి అడ్డుకున్నారు, అడ్డుకుంటున్నారు. చిత్రంగా అనేకమార్లు జనగామ, డోర్నకల్ నుండి మిర్యాలగూడెం రైలు మార్గమని కూడా ప్రచారం చేశారు. నిధులు కేటాయించి సర్వేలు కూడా చేశారు. అంతా ఎండమావిగానే మిగిలింది. ఇటీవల ఎక్స్ప్రెస్ హైవే / బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా చేశారు. ప్రచారం చేశారు.వాణిజ్య కారిడారుగా అభివృద్ధి చేయడానికి ఇది సరైనదని నిపుణులు కూడా సూచించారు. ఇది చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా విజయవాడకు వెళ్లాల్సిన రూట్ మ్యాప్ ను తుంగలో తొక్కి కానీ దాని అలైన్మెంట్ మార్చి రంగారెడ్డి నల్లగొండ జిల్లా మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే అంటూ దారి మళ్ళించాలని చూస్తున్నారు. ఇది ఆంధ్ర పాలకుల కుట్రలకు, సహజరించే తెలంగాణ ప్రాంత పాలకులు తోడై దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీనిపై ఈ ప్రాంత రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం విచారించ వలసిన విషయం. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కుట్రలకు ఇది మొదలు కాదు చివర కాదు.
బహుళార్థ సాధక, మానవ నిర్మిత ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ ను నిజానికి నక్కల గండి దగ్గర నిర్మించవలసి ఉన్నది. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను, కరువు సమస్యను నిలువ రించేందుకు కృష్ణా జలాలు తరలించాలని డిజైన్ చేశారు. ఆంధ్ర పెత్తందార్ల తరువాత , దీనిని హైజాక్ చేసి నందికొండ దగ్గర కట్టేలా ఒప్పించారు. ప్రాజెక్టులో అడుగుభాగం వరకు చుక్క నీరున్న కుడి కాల్వ ద్వారా పారేట్లు డిజైన్ చేశారు. ఎడమ కాలువ వరకు వచ్చేసరికి ఏడు కిలోమీటర్ల సొరంగం తవ్వి నీటిని ప్రవహించేలా నిర్మించారు. ఎడమ కాలువ( లాల్ బహదూర్ శాస్త్రి) నీటిని కూడా నల్లగొండ జిల్లా తలాపుగా మిర్యాలగూడ, కోదాడ మీదుగా ఖమ్మం చేర్చి జిల్లా అంతటానీరు ప్రవహించేలా డిజైన్ చేసుకొని ఆనందిస్తున్నారు. ఈ ప్రాంత రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సోయిలేని కారణంగానే జాతీయ రహదారి నియోజకవర్గాల ప్రజలకు ప్రస్తుత దుర్గతి పట్టింది. ఇప్పటికే నల్లగొండ నుండి విజయవాడకు 10 నుండి 14 రైళ్ళు నడుస్తుండగా కొత్త మార్గాన్ని కూడా ఆ జిల్లాగుండా వెళ్ళేట్టు అలైన్మెంట్ చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు.
ఉద్యమాల ఖిల్లగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలన్న దురాలోచనలను ప్రజలకు అర్ధం చేయించాలి. సూర్యాపేట – నల్గొండ గా ప్రజలను విడదీసి తమ పబ్బం గడుపు కోవాలని చూస్తున్న ఆంధ్ర ప్రాంత పెత్తందారి పాలక వర్గాల దుర్మార్గాలను వివరించాలి. ఆంధ్ర పెత్తందార్ల నైజన్ని సున్నితంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అర్ధమయ్యేలా చెప్పేందుకు బుద్ధిజీవులు కృషిచేయ్యాలి. నిజాం వ్యతిరేక పోరాటం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వరకు ఎన్నో త్యాగాల, పోరాటాల ఘన కీర్తిగల సూర్యాపేటకు తీరని ద్రోహం జరుగుతుంటే ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనవ్రతం పాటించడం బాధాకరం.సూర్యాపేట ప్రజలను దశాబ్దాలుగా ఊరిస్తున్న రైలు మార్గ సాధనకై ప్రజలు- ప్రజాసంఘాలు, విద్యార్థి- ఉపాధ్యాయసంఘాలు, అనన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యా చరణ ప్రకటించుకొని, పలురకాల ప్రత్యక్ష నిరసనకు పూనుకుంటే తప్ప ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్తు లేదు. ప్రజలారా, పారాహుషార్!
…
రమణాచారి





