prajatantra_news

prajatantra_news

మాజీ సిఎం పినరయ్ నివాసాలపై ఈడీ దాడులు

– కొచ్చిన్ మినరల్స్ లిమిటెడ్ కేసులో.. తిరువనంతపురం, మే 27 : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రూ.1.72…

ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

– రాష్ట్ర అభివృద్దికి సంబంధించి విన్నపాలు న్యూదిల్లీ, మే 27: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ దిల్లీలో తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారం కలుసుకున్నారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్ అక్కడినుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు.…

‘ఎస్ఐఆర్‌’ ప్రక్రియను తిప్పికొట్టాలి

– కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు – బీజేపీకి అనుకూలంగా ఉంటేనే ఓటు.. లేదంటే తొలగింపు – సమర్థులైన బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం. – జూన్ 30 లోగా అన్ని గ్రామ, మండల కమిటీల భర్తీ పూర్తి కావాలి ఖమ్మం, ప్రజాతంత్ర, మే 27 :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా…

పోలీస్ కస్టడీకి బండి భగీరథ్

– సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం మొయినాబాద్‌కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్‌ను మూడు రోజులపాటు…

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వడ్లు తడిసాయ్‌

– ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనాలి – ఇసుక రవాణా ఆపి ఆ లారీల్లో ధాన్యం తరలించాలి – రైతు సమస్యలు వదిలేసి ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు – చిన్నకోడూరులో మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 27 : ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన…

కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలు

– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 27: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 21న…

హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీని ఎంచుకోవాలి

– ఎంసెట్ విద్యార్థులకు మంత్రి పొన్నం వినతి – కాలేజీ కోడ్, బ్రోచర్, పోస్టర్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, మేజూఊ 27 : ఎంసెట్ రాసిన విద్యార్థులు హుస్నాబాద్ శాతహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆప్షన్ తీసుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక…

వయస్సు వల్ల చికిత్స కష్టమన్నారు

– ‘కేర్’లో సంక్లిష్ట‌ గుండె శస్త్రచికిత్స విజయవంతం – వృద్ధురాలికి ప్రాణం పోసిన వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: తీవ్ర గుండె సమస్య, కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స చేసి సాధారణ జీవితం గడిపేలా చేయగలిగారు. అనంతపూర్‌కు…

చల్లబడిన వాతావరణం

– పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షం – కల్లాల్లో తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన – తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం ఉపశమనం కలిగించినా అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో…

ప్ర‌భుత్వానివి త‌ప్పుడు లెక్క‌లు

– రైతులను మోసం చేస్తున్న రేవంత్ స‌ర్కార్‌ – బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన రైతు…