పోలీస్ కస్టడీకి బండి భగీరథ్

– సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం మొయినాబాద్‌కు తరలింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్‌ను మూడు రోజులపాటు ప్రశ్నించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. భగీరథ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడిని కస్టడీకి కోరుతూ మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు భగీరథ్‌ను మూడు రోజులపాటు పోలీసుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక ఆమెపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు భగీరథపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈనెల 16న అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *