– కొచ్చిన్ మినరల్స్ లిమిటెడ్ కేసులో..
తిరువనంతపురం, మే 27 : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రూ.1.72 కోట్ల ఈ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్(సీఎమఆరఎల్) అనే పైవేట్ కంపెనీ 2018`2019 కాలంలో విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి ఎలాంటి సేవలు అందించకున్నా సీఎమఆరఎల్‌కి రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించారనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2024లో ఈడీ కేసు దాఖలు చేసింది. ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆరఎల్ హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం సీఎంఆరఎల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం తెల్లవారుజామున ఈడీ అధికారులు తిరువనంతపురంలోని పినరయి అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసం, కోజికోడ్‌లోని పర్యాటక శాఖ మాజీ మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాస్ నివాసం సహా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.
ఈడీ దాడులపై భగ్గుమన్న సీపీఎం
బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపణలు
విజయన్ నివాసంపై ఈడీ దాడులను ఆ పార్టీ ఖండించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను నిరంతరం ఉపయోగించడంలో ఇది ఒక భాగమని అభివర్ణించింది. సీపీఎం, ఇతర ప్రతిపక్ష శక్తులపై జరుగుతున్న విస్తృత రాజకీయ వేధింపులు, వ్యక్తిత్వ హననంలో ఈ దాడులు ఒక భాగమని ఆ పార్టీ పేర్కొంది. ఈడీ దాడిని ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఖండించారు. ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా ‘ఎక్స’లో పెట్టిన పోస్టులో అభివర్ణించారు. ఇలాంటి చర్యలు విజయన్‌ను గానీ, సీపీఎంను గానీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో యÖడీఎఫ్ ప్రభుత్వానికి కూడా ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. ఈడీ దాడిని రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ తీవ్రంగా ఖండించారు. ‘రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర సంస్థలను పద్ధతి ప్రకారం దుర్వినియోగం చేయడానికి ఇది మరో ఉదాహరణ. ఇలాంటి కక్షపూరిత చర్యలు నిరంకుశ మనస్తత్వాన్ని బయటపెడతాయి. ఈ అప్రజాస్వామిక ఎత్తుగడలకు పినరయి, సీపీ¾ఎం బెదరబోవు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజల మద్దతుతో సీపీ¾ఎం దృఢంగా పోరాడుతుంది. అరవింద్ కేజీవ్రాల్ విషయంలో చేసినట్లే ఆయనను లక్ష్యంగా చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం ఈడీని చురుకుగా ప్రోత్సహించిందన్నది స్పష్టం’ అని పేర్కొన్నారు. ఈ చర్యను ప్రతిఘటించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సవిÖకరించి ప్రజాస్వామ్య నిరసనలు, సామÖహిక కార్యాచరణ ద్వారా ఈ దాడులను ఎదుర్కొంటామని పేర్కొంది. ఈడీ సోదాలకు వ్యతిరేకంగా కేరళతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీ శ్రేణులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కన్నూర్‌లోని విజయన్ కుటుంబ నివాసం, తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్‌లో ఉన్న ఆయన అదె ఇంటి ముందు సీపీఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టారు. తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోÃవిందన్, వి.శివన్‌కుట్టి, జాన్ బ్రిట్టాస్, వి.జాయ్, అనవూర్ నాగప్పన్, వి.కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కన్నూర్‌లో జరిగిన నిరసనలో ఎం.వి.జయరాజన్, పి.జయరాజన్, కె.కె.రాజేష్, కె.కె.శైలజ తదితరులు పాల్గొన్నారు. కోజికోడ్ జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీ¾ఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ ఈడీ సోదాలు పార్టీపై, పినరయి విజయన్‌పై జరిగిన హేయమైన రాజకీయ దాడిగా పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ విజయన్‌కు ఎక్సాలాజిక్ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టులు ఇప్పటికే పేర్కొన్నప్పటికీ రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయన్నారు.
విజయన్ ఇంటి వద్ద ఈడీ అధికారుల కారుపై రాళ్ల దాడి
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పినరయి మద్దతుదారులు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడి సమయంలో వాహనంలో మహిళా అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆందోళనకారులను సీపీఎం కార్యకర్తలుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువనంతపురంలోని థంపనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ రాక నేపథ్యంలో విజయన్ నివాసానికి ఆయన మద్దతుదారులు భారీగా చేరుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈడీ అధికారుల వాహనాన్ని అక్కడినుంచి పంపించేశారు. సోదాల సమయంలో మాజీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండగా బయట మద్దతుదారులు నిరసనలకు తెరతీశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కొందరు దాడికి దిగే యత్నం చేయడంతో పార్టీ సీనియర్ నేతలు వారిని అడ్డుకుని శాంతింపజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




