హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీని ఎంచుకోవాలి

– ఎంసెట్ విద్యార్థులకు మంత్రి పొన్నం వినతి
– కాలేజీ కోడ్, బ్రోచర్, పోస్టర్ విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మేజూఊ 27 : ఎంసెట్ రాసిన విద్యార్థులు హుస్నాబాద్ శాతహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆప్షన్ తీసుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యను అందించే గొప్ప అవకాశంగా గత విద్యా సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కోడ్, బ్రోచáర్, పోస్టర్‌ను మంత్రి పొన్నం వైస్ చాన్సలర్, రిజిస్ట్ట్రార్‌తో కలిసి సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తరుపున అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 22 ఉండగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కోడ్ ఎసఎయÖసీఈ(SU్పుజు) కేటాయించారన్నారు. ప్రైవేట్ కాలేజీతో పోటీగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మొదటి సంవత్సరమే వసతులు ఏముంటాయి అనే అపోహ అవసరం లేదని, భవన నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి.. మంచి వసతి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలో తరగతులు నడుస్తున్నాయి.. విద్యార్థినీ విద్యార్థులకు మొదటి సంవత్సరమే వేరువేరు హాస్టల్ వసతి కల్పించాం.. రవాణా ఇబ్బందులు లేవు.. శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ పట్టణంలోనే ఉంది.. మొదటి సంవత్సరంలో సీఎసఈ 60 సీట్లు, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60 సీట్లు, ఈసీఈ 60 సీట్లు, ఐటీ 60 సీట్లు, బయో టెక్నాలజీకి సంబంధించి 60 సీట్లు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, వర్క్‌షాప్స్, డ్రాయింగ్ రూమ్ ఉన్నాయి అని వివరించారు. ప్లేస్‌మెంట్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అవకాశాలతో ఈ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు కల్పిస్తుందన్నారు. కాలేజీ విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాల పంపిణీ, కాలిక్యులేటర్ పంపిణీ చేస్తారని మంత్రి పొన్నం తెలిపారు. స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అండ్ పేటెంట్స్ రీసెర్చ్‌పై అవగాహన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంతో వివిధ అంతర్జాతీయ దినోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అంతర్జాతీయ సదస్సులు, నిపుణుల ఉపన్యాసాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలిపారు. కరీంనగర్, జనగామ, సిద్దిపేట , హనుమకొండలకు మద్యలో ఉంటుందని హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్‌లో 250 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని, పీజీ మెడికల్ కాలేజీ మంజూరైందని మంత్రి పొన్నం తెలిపారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *