– కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
– బీజేపీకి అనుకూలంగా ఉంటేనే ఓటు.. లేదంటే తొలగింపు
– సమర్థులైన బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం.
– జూన్ 30 లోగా అన్ని గ్రామ, మండల కమిటీల భర్తీ పూర్తి కావాలి
ఖమ్మం, ప్రజాతంత్ర, మే 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారికి అనుకూలంగా ఉన్న వోటర్లను మాత్రమే జాబితాలో ఉంచి, అనుకూలంగా లేని వారిని వోటర్ లిస్ట్ నుంచి తొలగించటానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ పేరిట కుట్ర పూరిత ప్రక్రియను చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా ఆరోపించారు. బుధవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సర్ ప్రక్రియను తిప్పికొట్టటానికి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో సమర్థులైన బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జూన్ 30 వరకు మండల కార్యవర్గ కమిటీలు, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు,అనుబంధ సంఘ కమిటీలు పూర్తి చేయాలని చెప్పారు . పార్టీ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పని చేయాలని, సామాజిక న్యాయం పాటించాలని, పార్టీ పరంగా ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారుల ద్వారా పరిష్కరించి పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు. ప్రతి నెల జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలన్నారు. నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు,మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైరా మున్సిపల్ చైర్మన్ కాపా చంద్రకళ, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, డాక్టర్ కాపా మురళి కృష్ణ,పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





