prajatantra_news

prajatantra_news

త్యాగాల పునాదులపై ఏర్పడ్డదే బీఆర్ఎస్

– 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను ఐక్యం చేసిన జెండా – పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: దశాబ్దాలుగా అన్యాయానికి గురై నెత్తురు మరిగిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ అని…

సీఎం ప్రమాణానికి మళ్లీ వస్తా

– బెంగాల్లో ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం – బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 27: బెంగాల్‌లో 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం ముగిసింది. చివరి ప్రచారం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు బారక్‌పూర్‌లో చివరి ర్యాలీలో…

అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు

– పథకం వేగవంతం కోసం కలెక్టర్లకు మరిన్ని అధికారాలు – ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు – ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు – సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం – సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం అండ

– ధ్రువపత్రాలు, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ – రికార్డుస్థాయిలో 1050మందికి ధ్రువ పత్రాల మంజూరు – మీ బంగారు భవిష్యత్తుకు మాది భరోసా – మంత్రి సీతక్క హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని, వారి ఉన్నత విద్య,…

ప్రతీ కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

– జనగణనలో పాల్గొన్న‌ డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : జనగణన(సెన్సస్ 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్‌సైట్ ద్వారా ఆయన…

ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్‌ల ప్రమాణం

– ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా – హాజరైన సీఎం రేవంత్ తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు…

తిరుమల శ్రీవారి సేవ‌లో రామచందర్‌రావు

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ…

సమర్థవంతమైన సేవలందించాలి

– స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్‌కు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్ ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

ధర్మారావుకు బండి, ధత్తాత్రేయ పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహంతో శుక్రవారం జరిగిన ధర్నాలో అకస్మాత్తుగా…

పాంచజన్యం.. ఆచరణాత్మక అసాధ్యాల శంఖారావం

– రాజకీయ మనుగడ కోసం బృహత్ వ్యూహం     (వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ హామీలు ఇప్పుడు ఒక పెను తుఫానును సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత మౌనంగా ఉన్న బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఆమె ఎంచుకున్న…