హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహంతో శుక్రవారం జరిగిన ధర్నాలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని పోలీసులు నర్సంపేట కు తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో దాదాపు నాలుగు గంటలపాటు నడి ఎండలో ఉండటంతో ధర్మారావు గుండె పోటుకు గురయ్యారు. హుటాహుటిన వరంగల్ రోహిణి హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు స్టంట్ వేశారు. అదనపు చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి సంజjáYT వైద్యులతో మాట్లాడి ధర్మారావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధర్మారావు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
మంత్రితో పాటు ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, సీనియర్ నాయకులడు గంగిడి డాక్టర్ మనోహర్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, అధికార ప్రతినిధి సంగప్ప, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ధర్మారావును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




