– రాజకీయ మనుగడ కోసం బృహత్ వ్యూహం
(వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్)
తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ హామీలు ఇప్పుడు ఒక పెను తుఫానును సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత మౌనంగా ఉన్న బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఆమె ఎంచుకున్న ఈ మార్గం అత్యంత సాహసోపేత మైనదిగా కనిపిస్తున్నా. లోతుగా విశ్లేషిస్తే అందులోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది. రాజకీయాల్లో హామీలు గుప్పించడం నీళ్ల మీద రాతలు రాసినంత సులభం. కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఆకాశంలోని చందమామను చేతికి అందించడం వంటి అసాధ్యమైన పని. కవిత ప్రకటించిన ఐదు హామీలు కేవలం వోటర్ల మనసు గెలవడానికే కాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తన వైపు తిప్పుకోవడానికి చేసిన ఒక గంభీరమైన ప్రయత్నం. ఒకవైపు పాలకపక్షమైన కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా దూసుకొస్తున్న బిజెపికి తామే అసలైన ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడం ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు మర్మం. అయితే, ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తి ఉచిత విద్య, ఏ హాస్పిటల్ లో నైనా ఉచిత వైద్యం, లక్షలాది ఉద్యోగాల కల్పన వంటి అంశాలు వినడానికి విప్లవాత్మకంగా ఉన్నా. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మరియు బడ్జెట్ పరిమి తులను పరిగణనలోకి తీసుకుంటే ఇవి కేవలం ఎన్నికల స్టంట్లుగానే మిగిలిపోయే ప్రమాదం. ఉంది. ఒక బాధ్యతాయుతమైన నాయకు రాలుగా, అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను ఇప్పుడు చేస్తామని చెప్పడం ప్రజల విజ్ఞతను పరీక్షించడమే అవుతుంది. గత పదేళ్ల పాలనలో ఎదురైన వైఫల్యాలను కప్పిపు చ్చుకుంటూ, కొత్త ఆశల పల్లకీని ప్రజల ముందుకు తేవడం ద్వారా తన నాయకత్వాన్ని బలపరుచుకోవాలని. ఆమె చూస్తున్నారు. ముఖ్యంగా యువతను, విద్యార్థులను, రైతులను లక్ష్యంగా చేసుకుని ఈ ‘పాంచజన్యం’ పూరించ డం వెనుక రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్. పార్టీని మళ్లీ చక్రం తిప్పే శక్తిగా మార్చాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, అమలుకు నోచుకోని హామీలు ప్రజాస్వామ్యంలో నాయకులపై ఉన్న నమ్మకాన్ని సడలిస్తాయి. ఈ ఐదు హామీల అమలుకు అవసరమైన లక్షల కోట్ల నిధులను ఎక్కడి నుండి సమీకరిస్తారన్న ప్రాథమిక ప్రశ్నకే సమాధానం లేనప్పుడు ఈ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు చైతస్యవంతంగా ఉంది. ప్రతి హామీని తూకం వేసి చూస్తోంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన ఈ ప్రకటనలు ఆమెను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేస్తాయా లేక ఆమె రాజకీయ ప్రస్థానంలో మరో వివాదాస్పద అధ్యాయంగా మిగిలిపోతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆచరణాత్మకత లేని ఆశలు, వాస్తవ దూరమైన వాగ్దానాల మధ్య కవిత ‘పాంచజన్యం’ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది.
విద్యా వైద్య రంగాల్లో ఉచితాల వెనుక దాగిన ఆర్థిక విధ్వంసం కవిత ప్రకటించిన హామీలలో అత్యంత ఆకర్షణీయమైనవి విద్య మరియు వైద్యం, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందిం చడం అనేది ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన ప్రక్రియ. ప్రైవేట్ యాజమాన్యాలు లాభాపేక్షతో సడుస్తాయి, వారి నిర్వహణ ఖర్చులను ప్రభు త్వం భరించాలంటే రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం దానికే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్ప టికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైన ట్రాక్ రికార్డ్ ఉండగా ప్రైవేట్ పాఠశాలలను నియంత్రిస్తామనడం హాస్యాస్పదం. అలాగే, ఏ హాస్పిటల్ లోనైనా ఉచిత వైద్యం అన్న హామీ ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రస్తుత కాలంలో కూడా సాధ్యం కావడం లేదు. వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులను చేర్చుకోవడానికే నిరాకరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గాలిలో మేడలు కట్టినట్లుగా భారీ హామీలు ఇవ్వడం వల్ల ప్రజల్లో తాత్కాలికంగా ఆశలు చిగురించవచ్చు. కానీ చివరకు అది తీవ్ర నిరాశకే దారి తీస్తుంది. ఇది కేవలం వోటు బ్యాంక్ రాజకీయాల కోసం పన్నిన పద్మవ్యూ హం తప్ప ప్రజల క్షేమం కోసం చేసిన ఆలోచన కాదు.
ఉద్యోగాల జాతర.. అంకెల గారడీనా లేక యువతకు వేసిన ఎర?
ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు, లక్ష సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీ అనేది భారత రాజకీయ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసోపేతమైన ప్రకటన. అయితే దీని వెనుక ఉన్న లాజిక్ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాలీలు ఎన్ని ఉన్నాయి.. వాటి భర్తీకి అయ్యే ఖర్చు ఎంత అన్న వివరాలు లేకుండా కేవలం లక్షల్లో అంకెలు చెప్పడం ద్వారా నిరుద్యోగ యువతను ఆకట్టుకోవాలని కవిత చూస్తున్నారు. గత పదేళ్ల కాలంలో టీఎస్పీఎస్సీ చుట్టూ అల్లుకున్న వివాదాలు, పేపర్ లీకేజీలు నిరుద్యోగులను కుంగదీశాయి. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సింగిల్ నోటిఫికేషన్ పేరుతో మాయాజాలం చేస్తున్నారు. రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామనడం కూడా వాస్తవ దూరంగా ఉంది. ఏ రకమైన పూచీకత్తు లేకుండా బ్యాంకులు ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వవు. ప్రభుత్వమే హామీ ఇచ్చినా అది రాష్ట్ర అప్పుల భారాన్ని మరింత పెంచి ఆర్ధిక ఎమర్జెన్సీకి దారితీస్తుంది.
కాంగ్రెస్, బిజెపిల మధ్య బిఆర్ఎస్ దోబూచులాట
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పనిచేస్తోంది. అయితే అదే సమయంలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు రాష్ట్ర రాజకీ యాలను వేడెక్కిస్తున్నాయి. కవిత ఈ హామీలను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ కు తామే అసలైన ప్రత్యామ్నాయమని చెప్పాలనుకుంటున్నారు. కానీ, దిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బిజెపి అధిష్టానంతో బిఆర్ఎస్ అగ్రనాయకత్వం రహస్య ఒప్పందాలు చేసుకుందని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. కవితకు బెయిల్ రావడం, ఆ తర్వాత ఆమె దూకుడు పెంచడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ బిజెపితో పొత్తు పెట్టుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సెక్యులర్ ముద్రను చెరిపివేస్తుంది. ఈ గందరగోళం మధ్య కవిత ‘పాంచజన్యం’ పేరుతో హిందూ వోటర్లను ఆకట్టుకుంటూనే తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీని ఎటు వైపు తీసుకెళ్తుందో చూడాలి.
అయోమయ స్థితిలో తెలంగాణ వోటరు
ఈ మొత్తం విశ్లేషణలో చివరగా మిగిలేది ఒక పెద్ద సందిగ్ధత. కవిత చేస్తున్న ఈ పోరాటం పార్టీని గెలిపించడానికా లేక తన వ్యక్తిగత ఇమేజ్ను కాపాడుకోవడానికా? బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో యుద్ధం చేస్తూనే, లోపాయికారీగా బిజెపికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరి స్తోందన్న వాదనలో వాస్తవం ఎంత? సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించవచ్చని ఆమె భావిస్తున్నారా? ఒకవేళ బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆమె ప్రకటించిన ‘సామాజిక న్యాయం’ నినాదం ఏమవుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో మెదులుతు న్నాయి. స్పష్టత లేని రాజకీయ వ్యూహాలు, ఆచరణ లేని హామీల మధ్య కవిత ‘పాండ జన్యం’ ఒక పజిల్లా మారింది. ఈ గందర గోళం కాంగ్రెసు లాభిస్తుందా లేక బిజెపికి దారులు వేస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ, అమలుకు నోచుకోని అద్భుతాలను కా దు. కవిత దూకుడు పార్టీకి పునర్జీవం పోస్తుం దో లేక ఉన్న నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టేస్తుందో వేచి చూడాల్సిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





