ప్రతీ కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

– జనగణనలో పాల్గొన్న‌ డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : జనగణన(సెన్సస్ 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్‌సైట్ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ విధానం ద్వారా జనగణనలో సమాచార సేకరణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ప్రతీ కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సరిగ్గా అందుతాయని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ హిమవర్ష తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *