– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. దర్శనం అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా రామచందర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ కార్యాలయంలో ..
రామచందర్ రావు జన్మదిన వేడుకలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సం<ర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పార్టీ శ్రేణుల సమన్వయంతో సికింద్రాబాద్ తార్నాక ప్రాంతంలోని వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతంరావు, రాష్ట్ర కార్యదర్శి ఓ.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, ఇతర నాయకులు, పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




