సమర్థవంతమైన సేవలందించాలి

– స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్‌కు మంత్రి సీతక్క సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్ ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క దాన కిషోర్‌ను అభినందిస్తూ గ్రామీణ అభివృద్ధి రంగంలో ఆయన అనుభవం శాఖకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా పనిచేయాలని సూచించారు. అలాగే, గ్రామీణ పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణ, వంటి అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *