స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై19: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 84 , విధ్యుత్ శాఖ కు సంబంధించి 82, హౌజింగ్ కు సంబంధించి 79 దరఖాస్తులు, పంచాయతి రాజ్ గ్రాణ అభివృద్ధి శాఖ కు సంబంధించి 47, ఇతర శాఖలకు సంబంధించి 158 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.





