Take a fresh look at your lifestyle.

‌ప్రలోభావతారం

కొసరు లేకుంటే పిసరు
కట్నము కాకుంటే కానుక!
అవసరాన్ని బట్టి ముడుపు
కార్యాన్ని బట్టి లాంఛనము!

తాయిలమో? తాంబూలమో?
నచ్చిన పేరో! ఒప్పిన నామమో!
ఒకరికి చేతికి అర్పణం
మరొకరి జేబుకు తర్పణం!

అన్నన్నా!… అమ్యామ్యా అనకు
ప్రలోభానికి పట్టము అనుకోకు!
అగత్యానికి విలువ అనుకో
కార్య సాఫల్యానికి ఖరీదనుకో!

చాటు కార్యాలకు చణకనీతి
అన్నింటా వేళ్ళూరిన కుటిలరీతి!
అర్థం అయితే ‘‘అర్థం’’తో
అయిపోతుంది!
అర్థం కాకుంటే అనర్ధమే
మిగులుతుంది!

అది
ఆద్యంతాలు కానరాని విషవృక్షమది
లంచావతార అఖండ విశ్వరూపమది!
– ఉషారం, 9553875577

Leave a Reply