హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : ఎస్టీపీ ట్యాంక్‌లో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీపక్ హారీక్ అపార్టుమెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే కార్మికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





