– రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదు
– మారిషస్-రీయూనియన్ ప్రాంతంలో ప్రకంపనలు
– 10 కి.మీ లోతులో సంభవించిన భూకంపం
– ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
– సునామీ హెచ్చరిక లేదని యూఎస్ జీఎస్ స్పష్టీకరణ
” భారీ నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ ‘గ్రీన్ అలర్ట్’ జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: హిందూ మహాసముద్రంలో మంగళవారం భూకంపం సంభవించింది. మారిషస్ దేశానికి సమీపం లోని మారిషస్-రీయూనియన్ ప్రాంతంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (యూఎసీఎస్)
వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సుమారు 4:36 గంటలకు, భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ద్వీపం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి స్పష్టంగా కంపించడంతో భయాందోళన చెందిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని యూఎస్ జీఎస్ స్పష్టం చేసింది: సునామీకి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
‘గ్రీన్ అలర్ట్’ జారీ.. వరుస ప్రకంపనలు
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం సంభవించే అవకా శాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తూ యూఎస్ ఎస్ ‘గ్రీన్ అలర్ట్’
జారీ చేసింది. భూకంప ప్రభావం, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. కాగా, ఇటీవల హిందూ మహాసముద్రంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆగ్నేయ హిందూ మహాసముద్ర రిడ్జ్, రోడ్రిగ్స్ ట్రిపుల్ జంక్షన్ సమీపంలోనూ ప్రకంపనలు రావడంతో సముద్ర గర్భ భూకంపాలపై అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





