– అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర నవం బర్ 23: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులుగా డా క్టర్ బి.రామకృష్ణ. అటుకుల శ్రీని వాసరెడ్డి ఎన్నికయ్యారు. సోమవా రం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీ వో భవన్లో జరిగిన డీటీ ఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావే శంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్త యింది. డీటీఎఫ్ కు తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం లభించిన నేపథ్యంలో, పదవీ విరమణ చేసిన బాధ్యుల స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బాధ్యుల వివరాలు
రాష్ట్ర అధ్యక్షుడిగా డా.బి. రామకృష్ణ (హైదరాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటుకుల శ్రీనివాసరెడ్డి (హనుమకొండ), ఉపాధ్యక్షులుగా తూముల తిరుపతి (కరీంనగర్), ఎం.జయకృష్ణ(అదిలాబాద్), కార్యదర్శులుగా ఎ.గోవిందరావు (వరంగల్), బి.వెంకటే శం (నల్గొండ), అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులుగా డా.జి. కళావతి (జనగాం) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర పూర్వప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. కిష్టప్ప, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె. నారాయణరెడ్డి వ్యవహరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




