భద్రకాళి క్షేత్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి

– జ్వాలాతోరణ దర్శనానికి పోటెత్తిన భక్తులు
– భద్రేశ్వర స్వామికి శైవాగమ శాస్త్రోక్తంగా జపహోమ, సురార్చనలు

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 24: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధ భద్రకాళి క్షేత్రంలో భద్రేశ్వర స్వామి వారికి శైవాగమాన్ని అనుసరించి జపహోమ సురార్చనలు జరపడంతోపాటు జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ జ్వాలాతోరణం నుంచి భక్తులందరూ ఒకసారి వెళ్లి తిరిగి వస్తారు. తద్వారా మనిషి తాను చేసిన పాపాలన్నీ భస్మమైపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు వివరించారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, కమటం వేణుగోపాల్, వల్లూరి పవన్ కుమార్, కారెంగుల సురేష్ బాబు, చిదురాల అంజనీదేవి, రమేష్ చంద్ భంగ్, మాడిశెట్టి సతీష్, పేరాల శ్రీనివాసరావు పాల్గొన్నారని ఈఓ రామల సునీత తెలిపారు.

 

వేయిస్తంభాల గుడిలో.. 

 

హ‌న్మ‌కొండ‌ : ఓరుగ‌ల్లు చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి వేడుకలు మంగ‌ళ‌వారం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జరిగాయి. మహిళలు, యువతులు, చిన్నారులు అధిక సంఖ్యలో త‌ర‌లి వ‌చ్చి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు కాంతులు విర‌జిమ్మాయి. ఆ ప‌రిస‌ర ప్రాంత‌మంతా భ‌క్తిభావంతో నిండిపోయింది. ఉద‌యం వేళ‌ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *