రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా

దానిని ఆచరించి గౌరవించాలి
ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ..రాజ్యాంగాన్ని అపహాస్యం
రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీమ్‌ కోర్టుకు వెళతాం
రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌
ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే తమ కొంప ముంచిదని వ్యాఖ్య

రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌.. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. తెలంగాణలో నిర్లజ్జగా పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నా..రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా అని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటి రామారావు ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సబ్యులు కెఆర్‌ సురేష్‌ రెడ్డిలతో కలసి  ఆయన మంగళవారం దిల్లీలో వ్నిడియాతో మాట్లాడుతూ…పార్టీ ఫిరాయింపులకు  శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్‌ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని మండిపడ్డారు. ఆయారాం..గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీయేనన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై సుప్రీమ్‌ కోర్టులో కేసు వేస్తామని, స్పీకర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. అలాగే ఫిరాయింపుల  అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. రాహుల్‌ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఏకంగా కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనన్నారు.

 

సీఎం రేవంత్‌ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని, రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్‌ గొప్పలు చెబుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కెటిఆర్‌ మండిపడ్డారు. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఇప్పుడు అది పోచారం దాకా వొచ్చిందన్నారు. ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్‌ న్యాయ పత్రలో హావ్ని ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తుందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందన్నారు. అధికారంలోకి వొచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, డిసెంబర్‌ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క హావ్ని కూడా నెరవేరలేదన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని కెటిఆర్‌ విమర్శించారు. గోవా, కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదన్న రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు.

మణిపూర్‌లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే..ఆ ఎమ్మెల్యేని సుప్రీమ్‌ కోర్టు డిస్‌క్వాలిఫై చేసిందని, ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్‌ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్‌ చెప్పారనా, పార్లమెంట్‌లో ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని మాత్రం పాటించడం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తామని, లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని, సుప్రీమ్‌ కోర్టులో కేసు వేస్తామని కెటిఆర్‌ తెలిపారరు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్‌ గాంధీ ఆస్కార్‌ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని, ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కో బీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తూ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హావ్ని ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను ఆరుగురిని లాగేసుకుందని, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుందని కేటీఆర్‌ అన్నారు. యాంటీ డిఫెక్షన్‌ లా తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని.. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్‌ పార్టీనే అని విమర్శించారు.

ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే మా కొంప ముంచింది : కెటిఆర్‌
రాష్ట్ర ప్రజలతో తమకు గ్యాప్‌ వొచ్చిందని.. తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కవిత బెయిల్‌ విషయంపై న్యాయనిపుణులతో చర్చించేందుకు ఐదు రోజుల కిందట దిల్లీ వొచ్చిన హరీష్‌ రావుతో కలిసి కేటీఆర్‌ వ్నిడియా సమావేశం అనంతరం కొంత మంది వ్నిడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మట్లాడుతూ తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల గురించి కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పరాజయాలకు ప్రజలతో గ్యాప్‌ రావడమే కారణమని కేటీఆర్‌ అంగీకరించారు.  ప్రజలది తప్పు అనడమంటే..తాము తప్పు చేస్తున్నట్లుగా అంగీకరించడమేనన్నారు. హైదారాబాద్‌లో అన్ని సీట్లు గెలిచామని గుర్తు చేశారు. చేసిన అభివృద్ధిని తాము చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్ల ఓడిపోయామని చాలా మంది అంటున్నారని.. కానీ దానికి ఆధారం లేదని కేటీఆర్‌ అన్నారు. తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని కేటీఆర్‌ ఆరోపించారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదని..అభివృద్ధిలో తమతో పోటీ పడలేని వారే అహంకారమని ప్రచారం చేశారని అన్నారు. ఏపీ రాజకీయాలపైనా కేటీఆర్‌ స్పందిస్తూ..పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్‌ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

అయినా 40 శాతం వోట్లు సాధించడం మాములు విషయం కాదని..పవన్‌ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. జగన్‌ను ఓడిరచేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారని..అంతకు మించి షర్మిలకు బలం ఏవ్ని లేదన్నారు. హరీష్‌ రావు మాట్లాడుతూ…ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని..తమ పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని గుర్తు చేసుకున్నారు.  సుప్రీమ్‌ కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలనన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వొచ్చేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు.  ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని..రేవంత్‌ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని, పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు బిఆర్‌ఎస్‌ చేతుల్లో ఉన్నారని అన్నారంటే అది వారి చేతగాని తనం అన్నట్టేనని హరరీష్‌ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page