చర్చలతోనే పరిష్కారం

  • మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు
  • విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం
  • భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ
  • సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు రాష్ట్రా సిఎంల మధ్య శనివారం ప్రజాభవన్‌లో సమావేశం జరిగింది. దాదాపుగా గంటా 45 నిమిషాపాటు కొనసాగిన సమావేశంలో చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. అందుకు మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని ఇరువురు సిఎంలు నిర్ణయించారు. దాదాపు 1.45 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి కీలక అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న అయిదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనంపై చంద్రబాబు సానుకూటంగా స్పందించినట్లు తెలుస్తున్నది. ఇక తెలంగాణలో ఉన్న భవనాలను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కోరగా అందుకు రేవంత్‌ ‌రెడ్డి ఒప్పుకోలేదని తెలుస్తోంది. మంత్రులతో కూడిన కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్‌, ‌దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది తొలి భేటీ అని.. తర్వాత మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం.

 

మరీ ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 ‌లలో ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణలో ఉన్న కొన్ని భవనాలను.. ఆంధప్రదేశ్‌కు కేటాయించాలని ఆంధప్రదేశ్‌ ‌సీఎం చంద్రబాబు నాయుడు.. రేవంత్‌ ‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విజ్ఞప్తికి రేవంత్‌ ‌రెడ్డి అంగీకరించలేదని సమాచారం. తెలంగాణలో ఉన్న స్థిరాస్తులను ఏపీకి ఇచ్చే ప్రసక్తి లేదని.. రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ అర్జీ పెట్టుకుంటే తెలంగాణలో భూమి కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారని సమాచారం. దిల్లీలో ఏపీ భవన్‌ ‌తరహాలో తెలంగాణలో ఓ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తామని రేవంత్‌ ‌రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన వేళ తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్ర హోమ్‌ ‌శాఖకు లేఖ రాయాలని ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది.

భద్రాచలం మండలంలోని ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయితీలను రేవంత్‌ ‌రెడ్డి అడిగినట్లు సమాచారం. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్‌ ‌బకాయిల గురించి కూడా సీఎంల సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే తెలంగాణకు ఏపీ విద్యుత్‌ ‌బకాయిలు చెల్లించాలని రేవంత్‌ ‌రెడ్డి.. చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో ఈ ఒక్క భేటీతో అవన్నీ పరిష్కారం కావని భావించి.. మంత్రులు, అధికారుల కమిటీ విస్తృతంగా చర్చించేందుకు ఆ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ‌చీఫ్‌ ‌సెక్రటరీ శాంతి కుమారి పాల్గొనగా ఎపి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, ‌బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌, ‌చీఫ్‌ ‌సెక్రటరీ నీరబ్‌ ‌కుమార్‌ ‌ప్రసాద్‌ ‌హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page