మహిళా అంటే ఒక శక్తి
సృష్టికి మూలం మహిళ
మహిళతోనే మనుగడ
మరువలేము నీ త్యాగం!!
ఆమె సహనానికి మారుపేరు
అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర
మహిళా నీకు శతకోటి వందనాలు
ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!!
ఆమె ఒక అమ్మ ఒక నాన్న
ఆమె పొద్దుతో పోటీ పడుతుంది
కాలంతో పోటీ పడుతుంది ఆమె
ఈ జగతిన సరిలేరు నీకెవ్వరు!!
ప్రేమ త్యాగం సహనం ఆమె
మగువ మనుగడకే ప్రాణం పోసేది
అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం
భూమాతకు ఉండే సహనం ఆమెది!!
అంతు చిక్కని అనురాగ వైశాల్యం
పెంపకంలో మార్గదర్శి ఆమె
కష్టాలకు కుంగని కుంతీదేవి ఆమె!!
అలుపెరుగని ఓర్పు ఆమెది
నిరంతర శ్రమజీవి ఆమె
ఓ మగువా నీకు వందనం
ఆమెతోనే మన జీవన ప్రయాణం!!
– దేవులపల్లి రమేశ్
కలం: శ్రీ వర్ష
చరవాణి :9963701294