‌స్త్రీ శక్తి

మహిళలను దేవత రూపంలో
పూజించే సంస్కృతి మనది
స్త్రీ కన్నెరజేస్తే కాళికల
భగ భగ మండే ఆది పరాశక్తిలా
దర్శనమిస్తుంది…..
యుద్ధ సమయంలో స్త్రీయే కదా అని
చులకనగా చూస్తే శత్రువుల గుండెలో
పరుగులు పెట్టించిన ఘనత చరిత్ర
తెలుపుతుంది…..

స్వాతంత్య్ర స్వగ్రామంలో
జాన్సీ లక్ష్మి భాయ్‌ ‌మొదలు
సామాజికకోద్యమాలు
చాకలి ఐల్లమ్మ వరకు చరిత్ర గాంచిన
వీర వనితలు నేటికి ఆదర్శం…..
మానవ జాతి మనుగడకు
స్త్రీ కావాలి
ఓ అమ్మలా, తోబుట్టువుగా, సహచారిగా
ఉంటు నిరంతరము సేవలు అందిస్తూ
ఇంట్లో వెలుగులు నింపుతుంది……

మహిళ అంటే విపత్కర పరిస్థితిలో
వీర నారిలా, ఆపద సమయంలో
మదర్‌ ‌థేరిసాలా, శుభ సమయంలో
ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ
వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది….
కుటుంబ వ్యవస్థను
సాంస్కృతిక సంప్రదాయాలను
కాపాడుతూ దేశ ఔనత్యాన్ని
ప్రపంచ దేశాలకు చాటుతుంది.
     -మిద్దె సురేష్‌, ‌కవి, వ్యాసకర్త
         9701209355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page