రాష్ట్రంలో బిజెపినే ప్రత్యమ్నాయం కానుందా !

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ …‌బీఆర్‌ఎస్‌అ‌స్త్రసన్యాసం ..?

మండువ రవీందర్‌రావు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను ఆయన ఆధ్వర్యంలో బిజెపి కైవసం చేసుకుంది…  తాజాగా రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండింటిని భారతీయ జనతా పార్టీ గెలుచుకో వడంతో ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎమ్మెల్సీ ఛాంపి యన్‌ ‌ట్రోఫీ విజేతగా తమపార్టీయే నిలిచిం దంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ  లేదా ఉప ఎన్నికల విషయంలో సహజంగా అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాని ఇక్కడ ఆ ఆనవాయితీ తారుమారైంది. రాష్ట్రంలో పెద్దగా పట్టులేదనుకున్న బిజెపి రెండు స్థానా లను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో పట్టభద్రుల ఎమ్మెల్సీ  విషయం మరింత విస్మయాన్ని కలిగించింది. ఇది కాంగ్రెస్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానం. గతంలో ప్రతిపక్షంలో ఉండి గెలుచుకున్న ఈ స్థానాన్ని నేడు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్‌ ‌దక్కించుకోలేకపోయింది.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి సుమారు పద్నాలుగు నెలలు కావస్తున్నది. ఈ పద్నాలుగునెలల కాలంలో తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నిటినీ అమలు చేసిన తీరును, వేల సంఖ్యలో ఉద్యో గాలను కల్పిం చిన విషయాన్ని వో టర్లకు సోదా హరణగా విని పిం చింది. గత ప్రభు త్వం కన్నా మిన్న గా చేపడు తున్న సంక్షే మాన్ని వివరించారు. గతంలో ఏ ముఖ్య మంత్రి కూడా భారీ బహిరంగ సభల ద్వారా ఎమ్మెల్సీ  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించని విధంగా రాష్ట్ర సిఎం రేవంత్‌రెడ్డి మూడు సభల్లో ఏకధాటిగా మాట్లాడినా విద్యా వంతులు ఎందుకో కన్వీన్స్ ‌కాలేకపో యారన్నది స్పష్టమవుతున్నది.
ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 23 మంది ఎమ్మెల్యేలను  ఎన్నికల యుద్దానికి ముందస్తుగానే సన్నద్దం చేసినా కాంగ్రెస్‌ ‌ఫలితాలను సాధించలేక పోయింది. బిసీ రిజర్వేషన్‌ ‌విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పైన కూడా పెద్దగా స్పందన వొచ్చినట్లులేదు. అయితే ఈ ఫలితాలతో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ ‌మొదలైన ట్లేనన్న ప్రచారం జరుగుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ అయితే కాంగ్రెస్‌కు తామిచ్చే రంజాన్‌ ‌గిఫ్ట్‌గా దాన్ని అభివర్ణించారు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయం బిజెపి అన్నది స్పష్టమవుతున్నదన్నారు.
వాస్తవంగా ఇటీవల కాంగ్రెస్‌ ‌నాయకులమధ్య అంతర్లీనంగా విభేదాలు  పొడ సూపుతున్న వార్తలు వెలుగు చూస్తు న్నాయి. పద్నాలుగు నెలలుగా మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం, బిసీ రిజర్వేషన్‌ ‌విషయంలో నాయకులు నోటిని అదుపులో పెట్టుకోకపోవడం, ఈ విషయంలో ఒకరు సస్పెన్షన్‌కు గురికావడం, పార్టీ పరిశీలకుల మార్పు తదితర ఆంశాలు ఆ పార్టీని కొంతకాలంగా చికాకు పెడుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ  ఎన్నికలపై ఎంత శ్రద్ద పెట్టాలో అంతగా పెట్టకపోవడం ఒకటికాగా, అధికారపార్టీ గా తమ గెలుపు ఖాయమన్న భావన ఆ పార్టీ నాయకుల్లో ఏర్పడి విస్తృత ప్రచారంలో పాల్గొనలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బిజెపికి అవకాశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండే తెలంగాణ పైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అదే లక్ష్యంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. అభ్యర్థులను కూడా ముందస్తుగానే ప్రకటించింది. మొదట్లో ప్రచారంలో కొంత వెనుకబడినా  చివర్లో దూకుడును ప్రదర్శించింది. ప్రతీ వోటరును స్వయంగా కలుసుకునే విధంగా తమ క్యాడర్‌కు ప్రోత్సహించడమే ఈ విజయానికి కారణమైందని తెలుస్తున్నది. కాగా, కాంగ్రెస్‌ ‌టికట్‌ ఇవ్వకపోవడంతో బిఎస్పీ నుండి పోటీకి దిగిన ప్రసన్న హరికృష్ణ వోట్లు చీల్చడం కూడా బిజెపి గెలుపుకు అవకాశంగా మారింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను ఆయన ఆధ్వర్యంలో బిజెపి కైవసం చేసుకుంది. వీరు కాక గతంలో ఒక ఎమ్మెల్సీ , ఇద్దరు రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న ఈ పార్టీ రానున్న ఎన్నికల్లో కూడా విజయపరంపరను కొనసాగిస్తామని చెబుతున్నది. దక్షిణాదిన తమ పార్టీని విస్తృత పరచేందుకు తెలంగాణ పైన కాషాయ జండాను ఎగురవేయడం అనివార్యంగా ఆ పార్టీ భావిస్తున్నది.
అందుకు రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికలపైన ఇప్పటినుండే దృష్టి సారిస్తున్నది. పంచాయితీల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనంటూ తమ ప్రచారాన్ని ముమ్మరంచేస్తున్నది. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పాల్గొనకపోవడమే బిజెపికి అనుకూలంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణమేదైనా ఈ ఎన్నికల్లో పోటీచేయకపోవడాన్ని కాంగ్రెస్‌, ‌బిజెపిలు బిఆర్‌ఎస్‌ ‌పని అయిపోయిందంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా రానున్న పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించుకునే దిశగా బిఆర్‌ఎస్‌ అడుగులువేస్తున్నది. పంచాయితీ ఎన్నికలలోగా పార్టీమారిన పదిమంది ఎమ్మెల్యేల  విషయంలో ఆ పార్టీకి అనుకూలంగా తీర్పు వొస్తే రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page