రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ‘సంవిధాన్ రక్షా మార్చ్’

లిబర్టీ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ (రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ-Constitution Day Rally) అత్యంత ఉత్సాహంగా జరిగింది. లిబర్టీ చౌరస్తాలోని ట్యాంక్‌బండ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ భారీ ప్రదర్శన కొనసాగింది.  రాజ్యాంగ విలువలను కాపాడాలనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బి.ఎం. సందీప్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రదర్శన స్థలానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాలు సందడిగా మారాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *