‌ప్రభుత్వ పాఠశాల విద్య ముఖచిత్రం మారాలి

దిల్లీ, సింగపూర్‌, ‌ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకే  స్కూళ్లను  అధ్యయనం  చేస్తాం..
: ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు
•ఉన్నతాధికారులతో విద్యా  సంస్కరణలపై సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసు• •ళ్లడం ద్వారా పా• ••శాల విద్య ముఖ చిత్రాన్ని సమూల ంగా మార్చాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఆదేశించారు. సోమవారం నాడు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ డాక్టర్‌ ‌యోగితా రాణా ఇతర ఉన్నతాధి కారులతో విద్యాసంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందిం చిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని ఈ సం దర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ప్రైవేటు పాఠశా లలతో పోటీ పడలేక పోతున్నామని దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని శ్రీధర్‌ ‌బాబు సూచి ంచారు. ‘‘ స్కూళ్లలో మౌలిక సదుపా యాలు మరింత మెరుగు పర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అంది ంచాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి సంకల్పి ంచారు.

ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి. గుజరాత్‌ ‌నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యా యాలు సింగపూర్‌ ‌కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు. ఆ తరహా ప్రయత్నం మనవద్ద కూడా జరగాలి. ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యుకెలలోని విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశ పెట్టాలి. పాఠ్యాం శాలను మార్చాలి. సింగపూర్‌ ‌ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీ కరించింది. త్వరలోనే సింగపూర్‌ ‌బృందం పర్య• •స్తుంది. మన ఉపాధ్యాయులను కూడా ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’. దానికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేయాలని శ్రీధర్‌ ‌బాబు ఉన్నతాది •కారులను ఆదేశించారు. ‘‘వచ్చే 2-3 ఏళ్లలో మన విద్యా విధానంలో సమూల మార్పులు జరగాలి. విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.

దిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ళను పరిశీలించి అందులో మెరుగైన విధానాలను అమలు చేసే విషయం పరిశీలించాలని శ్రీధర్‌ ‌బాబు ఆదేశించారు. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌ను కర్రికులమ్‌ ‌లో భాగం చేయాలి: ‘‘కింది తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలి. హైస్కూల్‌ ‌స్థాయిలో దానిని వినియోగించి తెలివితేటలను పెంచుకునేలా చూడాలి. భేషజాలకు పోకుండా కన్సల్టెంట్ల సేవలను తీసుకోవాలి. మన ఆలోచనల కంటే వారి సూచనలు వాస్తవికంగా ఉంటాయి.

ఒకప్పుడు డిఇఓలు తరచూ స్కూళ్లను తనిఖీ చేసేవారు. ఎంఇఓలు కూడా ఇతర పనులు చేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలు పెంచే ప్రయత్నం జరగడం లేదు. స్కూళ్లలో వకృత్వ పోటీలు జరిగేవి. విద్యార్థులను పిక్నిక్‌ ‌లకు తీసుకెళ్లేవారు. ఎక్స్ ‌కర్షన్లు ఉండేవి. ప్రైవేటు స్కూళ్లలో ఇవన్నీ జరగుతున్నాయి. వచ్చే తరం పిల్లలకు మనం ప్రపంచ స్థాయి విద్యను అందించగలిగితేనే వాళ్లు పోటీ ప్రపంచంలో మనగలగుతారు. ఈ విషయాన్ని గుర్తెరిగి సమూల మార్పులకు దారి వేయాలి అని మంత్రి శ్రీధర్‌ ‌బాబు సూచించారు. సమీక్ష సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్‌ ఇ. ‌వెంకట నరసింహారెడ్డి, అదనపు డైరెక్టర్‌ ‌లింగయ్య, ఓపెన్‌ ‌స్కూల్‌ ‌డైరెక్టర్‌ ‌శ్రీహరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page