అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం

  • ‘పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌బాబు
  • ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం
  • అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌

‌పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్‌2: అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా ఐసీడీఎస్‌ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా కేక్‌ ‌కట్‌ ‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై ఐసీడీఎస్‌ ‌ప్రాజెక్టు ఆధ్వర్యంలో చిన్నారులకు నిర్వహించిన అన్నప్రాసన,    (ఖీ2వ పేజీలో…)
అక్షరాభ్యాసాలలో మంత్రి స్వయంగా అక్షరాలను దిద్దించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి ఆరేళ్ల వరకు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారంలో నాణ్యత తగ్గకుండా, అందరితో కలిసి సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని హా ఇచ్చారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మాట్లాడి అంగన్వాడీ టీచర్ల ఖాళీలను భర్తీ చేసే విధంగా, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరికీ ముందస్తుగా సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *