అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి చర్యలు
సిబ్బందిపదవి విరమణ ప్రయోజనాల పెంపునకు ఆమోదం
పోడు పట్టాల పేటెంట్ కాంగ్రెస్ కే..
మహిళా భద్రతపై బిఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరం
బిఆర్ఎస్ పాలనలోనే లక్షన్నరకు పైగా మహిళలపై దాడులు
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ముందు పథకాలను ప్రవేశపెట్టడం ఆ తర్వాత మర్చిపోవడం బిఆర్ఎస్ విధానం. పరిపాలన వికేంద్రీకరణ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పాలన కేంద్రీకృతం చేస్తే మేము వికేంద్రీకరణ చేస్తున్నాం. మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించారు కానీ బిల్లును చెల్లించలేదు. బీసీ కుల గణన రిజర్వేషన్ పెంపు అంశం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. కెసిఆర్ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. చిన్నచిన్న గ్రామపంచాయతీల మీద ట్రాక్టర్ల భారాన్ని మోపారు. ఆడంబరాల కోసం కోట్లు ఖర్చుపెట్టిన బిఆర్ఎస్ .. గ్రామపంచాయతీలకు కనీసం ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇవ్వలేదు.
మిషన్ భగీరథ పేరుతో కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోకుండా వందల కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తరలించారు. కాంట్రాక్టర్ల కోసం కమీషన్ల కోసమో ఎక్కువ దూరం నుంచి నీళ్లు తెచ్చే పనులు చేపట్టారు. భయపెట్టి బతిలాడి ఇంటింటికి తాగు నీళ్లు అందుతున్నాయని సంతకాలు తీసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరి గొంతు నొక్కారు. నెలకు మూడుసార్లు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయిస్తున్నాం.
రోడ్డు కటింగ్ వంటి కారణాలతో ఎక్కడైనా తాగునీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరిస్తున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం. మేము అధికారులకు వొచ్చిన తర్వాత సర్వే చేస్తే నాలుగు లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు లేవు. మూడున్నర లక్షల గ్రామాలకు ప్రేజర్ లేదు. మేము వొచ్చిన తర్వాత ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు నిధులు వెచ్చించాం. పోడు పట్టాల పేటెంట్ కాంగ్రెస్ కే దక్కుతుంది. అటవీ హక్కుల చట్టం తెచ్చి గిరిజన ఆదివాసీలకు పోడు భూములను కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు.