విద్య అనేది మన దేశం లో పురాతన కాలం నుంచి సైతం అతి ప్రాముఖ్యమైనదిగా భావించేవారు. విద్య కు కు విజ్ఞానాన్ని బోధించే వారికి సైతం అధిక ప్రాముఖ్యతని ఇచ్చేందుకు అవకాశం ఉండేది. అందుకే అప్పట్లోనే మనదేశంలో నలంద మరియు తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం, అంతేకాకుండా మన దేశం లో మొదట నుండి గురు శిష్యుల పరంపర సైతం ఉండేది, మన పూర్వికులు సాధు, సంతువుల నుండి విద్యను అభ్యసించేవారు. తదనంతరం మారుతున్న పరిస్థితుల కనుగుణంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయ బడ్డాయి. ఆనాడు చిన్న బాలశిక్ష , పెద్ద బాలశిక్ష, బారిష్టర్ వంటివి చదివే వారము. ఐతే ఇప్పుడు విద్య అందులోనూ ఉన్నత విద్య డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులుగా రూపాంతరం చెందింది. అయితే ఈ ఉన్నత విద్య అన్ని వర్గాలకు దళిత గిరిజనులకు, బీద బడుగు బలహీనవర్గాలకు, శ్రామిక కార్మిక కర్షక వర్గాలకు సైతం అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వాలు ఆలోచించి, ఒక సకరాత్మక దిశ లో మహత్తరమైన వ్యూహం తో ఒక గొప్ప పధకానికి శ్రీకారం చుట్టారు.
ఆ పథకానికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం గా నామకరణం చేసారు. యుద్ద ప్రాతిపదికన ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకానికి విధి విధానాలను రూపొందించారు, ప్రభుత్వ ఉద్యోగం లేని మరియు 2లక్షల వార్షికాదాయం లోపు గల కుటుంబాలకు సంబంధించిన అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పధకాన్ని వర్తింప చేసి, ఇంజనీరింగ్ చదివితే ఇంజినీరింగ్ కోర్సు చదవాలని భావిస్తే ఇంజనీరింగ్ కోర్సు కి అయ్యే మొత్తం ఫీజు ను, అంతే కాకుండా వివిధ రకాల కోర్సు లను చదివితే ఆయా కోర్సుల ఫీజులను మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథ సారథి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు వై యస్ రాజ శేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఆ ప్రభుత్వ హయాం లో ఈ పథకం గొప్పగా చక్కగా అమలు జరిగినప్పటికీ కొన్ని సంవత్సరాలు పాటు అంతరాయాలు లేకుండా జరిగినప్పటికీ, ప్రభుత్వాలు అధికారులు మారుతూ వచ్చాక వారి ప్రాధాన్యత సైతం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి బదులుగా మిగతా సంతుష్టీకరణ పథకాలు ఇంకా వేరే పతాకాలపై శ్రధ్ధ వహించి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడుస్తు ఆ పథకాన్ని నీరు గార్చారు. అయితే ప్రభుత్వం రేపటి తరం కోసం, రానున్న రోజుల్లో రాష్ట్రం తద్వారా దేశ అభివృద్ధి కొరకు పెడుతున్న పెట్టుబడిగా భావించాల్సింది పోయి ఈ పథకాన్ని ఒక వృధా ఖర్చు లాగ భావించారు. దాని కారణంగా బీద బడుగు బలహీనవర్గాలకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అల్ప సంఖ్యాక వర్గాలకు, హరిజన గిరిజనులకు ఉన్నత విద్య ఒక అందని ద్రాక్ష లాగా తయారయ్యింది.
ప్రతీ సంవత్సరం దాదాపుగా ప్రతి ఏలా 10 లక్షల నుండి 12లక్షల విధ్యార్ధులు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి నమోదు చేసుకుంటున్నారు. దీని కారణంగా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరాం 2000కోట్ల నుండి 2450 కోట్ల వరకు ఆర్థిక భారాం పదనున్నది. అయితే ఇంతకు పూర్వం పూర్తిగా ఆయా కోర్సు ల యొక్క మొత్తం ఫీజు ను ప్రభుత్వమే భరిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా కోర్సు ఫీజు 35000 రూపాయల కంటే అదనం గా ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం35000 రూపాయలు మాత్రమే ప్రభుతం చెల్లిస్తుంది. దీనికారనంగా మిగతా ఫీజు ను చెల్లించే క్రమం లో సైతం సామాన్య విద్యార్థుల మీద వ్షేరి కుటుంబాల మీద తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంధనేది ఎవరు కాదనలేని నిజం అని తెలంగాణ మేధావి వర్గం అభిప్రాయ పడుతూ ఉన్నది.
దీని కారణంగా విధ్యార్ధులు ప్రభుత్వం విడుదల చేసే 35000 కాకుండా తక్కిన అనగా మిగతా ఫీజు కోసం 5 రూపాయలకి 10 రూపాయిలకి అప్పులను తీసుకు వచ్చి చెల్లిస్తున్నారు. , మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేసే ఆ 35000 రూపాయిలు సైతం సమయానికి విడుదల చేయని కారణంగా విధ్యార్ధులు తల్లి తండ్రులు ఉన్నత విద్య ను అభ్యసించాలి అనే ఆశను కోరికలను చంపుకుంటున్నారు. దీని కారణంగా అనేక మంది విద్యార్థులు ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలను విద్యా సంస్థలు, విధ్యార్ధులు రాజకీయ పక్షాలు విద్యార్థి సంఘాలు పదే పదే ఉద్యమాలు చేసి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సరైన సమయం లో విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాల తీరు మారటం లేదని తెలంగాణ పౌర సమాజం భావిస్తుంది.
అధికారం రాకముందు ఎన్నికల నాటికి, ఎన్నికల సమయం లో, ప్రతిపక్షాలుగా ఉన్న సమయం లో చేప్పే ప్రకటనలు ఏమో అణగారిన వర్గాలకు అత్యున్నత విద్య సుగమం అవుతుంది అనేలా ప్రకటనలు చేస్తూ, అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పర్చాక అయితే ప్రభుత్యాల తీరు మాత్రం మారటం లేదు, అధికారం ఇచ్చాక ప్రభుత్వం తీరు షరా మామూలు గానే పాత ప్రభుత్వం తీరు లానే కనిపిస్తుందని తెలంగాణ సభ్య సమాజం ఆవేధన వ్యక్తం చేస్తుంది.
ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం, పథకాల అమలు తీరు సరిగా లేని కారణం గా చివరకు కోర్సులు పూర్తయిన విధ్యార్ధులు సైతం ఇంకా పై చదువుల కోసమో మరియు ఉద్యోగ అవకాశాల కోసమో ఏమో విధ్యార్ధులు ధ్రువపత్రాలు ఇవ్వాలి అని యాజమాన్యాలను కోరటం, చదువులు అయిపోయిన విద్యార్థులకు సైతం ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయని కారణంగా విద్యార్థులు అత్యంత తీవ్రమైన మనో వేదనకు గురవుతూ యాజమాన్యాలు చేస్తున్న పాశవిక చర్యలకు విధ్యార్ధులు బలైపోతున్నారు. చివరకు వచ్చిన ఉన్నత చదువుల అవకాశం వదులుకోలేక , వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోలేక తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కళాశాలల ఫీజులను చెల్లించి విధ్యార్ధులు ధృవ పత్రాలను తీసుకుంటున్నారనేది ఎవరు కాదనలేని నిజం అని తెలంగాణ విద్యార్థి సమాజం ముక్త కంఠం తో చెప్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా, తెలంగాణలో విద్యారంగ పరిస్థితి అత్యంత దయనీయంగా రోజు రోజుకు దిగజారుతూ విద్యాలయాల ప్రమాణాలు పడిపోతూ వస్తున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుతంలోను ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచారు, విడుదల చేసే నిధులను సమయానికి విడుదల చేయలేదు, విద్యా రంగాన్ని గాలికి వదిలేశారు అనేది ఎవరు కాదనలేని నిజం. అయితే కనీసం ఇప్పుడు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం %ంసఱశ్రీశ్రీ బఅఱఙవతీంఱ్‌వ% లాంటి గొప్ప ఆలోచనలు చేస్తుంటే రాష్ట్రం లో విద్యా రంగం లో గణనీయంగా మార్పులు వస్తాయి అని విశ్వశించాం అయితే ఈ ప్రభుత్వం తీరు సైతం అలాగే ఉంది. వీరి పాలనలో సైతం దాదాపుగా 6 మాసాల నుండి విశ్వ విద్యాలయాలు ఇంచార్జి ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఈ రోజు వరకు విద్యా శాఖకి ఒక మంత్రి లేరు. విద్యా శాఖ పై ఒక సమావేశం నిర్వహించింది లేదు. విద్యా కమిషన్ ని అయితే ఏర్పరచారు కానీ ఈ రోజు కి వారు సైతం విద్యా రంగం పై ఎలాంటి ఆలోచన చేసిన దాఖలాలు కనిపించలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అయితే ముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థి సమాజానికి భరోసాను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాదాపుగా 2020-21 విద్యా సంవత్సరం నుండి 2021-22, 2022-23, 2023-24 వరకు దాదాపుగా 8350 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చెయ్యాలి. ప్రభుత్వం విడుదల చేయని కారణంగా విధ్యార్ధులు మనోవేదనకు గురవుతున్నారు. అప్పులు తెచ్చి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళ అప్పు పుట్టక మెస్ బిల్లు లు చెల్లించకపోతే కొన్ని ప్రముఖ కళాశాలల్లో పరీక్షా ఫీజులను తీసుకోరు, పరీక్షలను రాయనివ్వరు, హాల్ టికెట్ లను ఇవ్వరు, ఫలితాలను చూసుకొనివ్వరు, ఇదేంటి ప్రభుత్వమే కదా విడుదల చెయ్యాల్సింది అని అడిగితే వెళ్లి ప్రభుత్వాన్ని అడగండి అని ధబాయించే అధికారులు కళాశాలలు సైతం మన రాష్ట్రంలో ఉండటం పట్ల విధ్యార్ధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము దృష్టికి పోయేలా ఒక నిరసన తెలిపిన దానికి సైతం ఆగ్రహించి షో కాజ్ మేమో లు జారి చేసి విద్యార్థులను భయ బ్రాంతులకు గురిచెయ్యటాన్ని తెలంగాణ రాష్ట్ర మేధావి వర్గం తప్పు పడుతుంది.
ప్రైవేటు కళాశాలల్లో మరియు ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్త్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోతే మేమే చెల్లిస్థాం అని సైతం భయబ్రాన్తులకు గురిచేసి బాండ్ పేపర్ పై అండర్ టేకింగ్ రాయించుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలలో సైతం 100 రూపాయిల, 200 రూపాయిల బాండ్ పేపర్ పై అండర్ టేకింగ్ రాసి ధృవ పత్రాలను తీసుకొనే దుస్థితి ప్రభుత్వ విశ్వ విద్యాలయ కళాశాల్లలోనే ఉంటే ఇక ప్రైవేటు కళాశాలల్లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉంటాయో, ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అనటం అతి శయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఒకానొక దశలో ప్రభుత్వ విశ్వ విద్యాలయంలోనీ అధికారులు వసతి గృహాలను ప్రైవేటు పరం చేస్తాం అని విద్యార్థులను భయబ్రాంతులకు గురుచేస్తున్నారనేది ఎవరు కాదనలేని సత్యం. కావున ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తే విద్యాలయాల్లో చక్కని విద్యా వాతావరణం ఉంటుంది అని విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి.
దాదాపుగా 4 సంవత్సరాల నుండి బకాయిలు విడుదల కానీ కారణంగా రాష్ట్రంలో డిగ్రీ పీజీ , ఫార్మసీ కళాశాలలు యాజమాన్యాలు, కలశాలలు మూసివేసి ప్రభుత్వంకు తమ సమస్యలను తెలియ జేస్తున్నాయి. ఇదిలానే కొనసాగితే నెమ్మదిగా ఇంజనీరింగ్ కలశాలలను సైతం మూసి చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని కారణం గా విధ్యార్ధులు విలువైన తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్యం, విద్యను, విధ్యార్థులను ప్రథమ ప్రాధాన్యతగా భావించి, పెండిరగ్ లో ఉన్న 8,350 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను మెస్ ఛార్జ్ లను యుద్ధ ప్రాతిపదికన, త్వరితగతిన విడుదల చేయలనీ, విడుదల చేసి ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంది అనే భరోసాను కల్పించాలి అని విద్యార్థి మరియు పౌర సమాజం డిమాండ్ చేస్తున్నది.
జవ్వాజి దిలీప్,
పరిశోధక విద్యార్థి,
సామాజిక కార్యకర్త,
జె ఎన్ టి యు హెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యుడు
చరవాని: 7801009838.





