పరిమళించే క్షణాలు

వాగు ఒడ్డున ఇసుక తిన్నెలు
గుసగుసలాడుతుంటే నడిసొస్తున్న వెన్నెల నీవు

రంగుల క్షణాలెన్నో
నా ఏకాంతాన్ని  చుట్టేసినప్పుడు
నేను శూన్యపు చూపును

నువ్వున్న చోట
నా నీడ కూడా పరిమళిస్తుంది
కనబడని కలలను చెక్కుతుంది

చల్లగాలి పులకరింతను
మనసు వాకిట పరిచేసి
కబుర్ల దారంతో
మధురిమలెన్నింటినో
నీకోసం
ఏరికూర్చాలనిపిస్తుంది…

అందంగా ఒక్క వాక్యమైనా రాద్దామంటే
మళ్ళీ వసంతం నీ నవ్వులా పూయాలేమో…

మోడైన గుండె చిగురించాలంటే
నీ కన్నుల వాకిట్లో సిరిమల్లెనై వికసించాలేమో…

కలనైనా నీవు కనిపిస్తే
కలవరమే లేని క్షణాలు
మళ్ళీ జన్మిస్తాయి..

భానుశ్రీ కొత్వాల్
నల్లగొండ.  సెల్… 98668 63913 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *