ఓ అందాల మేఘమా!
ఆకాశంలో ఆవిరి మేఘమా అంబరాన అందాల రూపమా కారు మబ్బై గర్జించే మేఘమా గాలి కెరటాలకే భీరువువై పోతావా దూది పింజమై దూరాలకు తేలిపోతావా! నింగి క్రింద నువ్వో మొగులు ఎండకు నువ్వో గొడుగు వానకు నువ్వో మొయిలు ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర! గగనంలో జలతారు తేరు అప్సరసలు విహరించు విహారాల తీరు…