అక్టోబర్‌ 2…‌ మద్రాసు ప్రెసిడెన్సీలో క్రిసెంట్‌ ‌పత్రిక ప్రారంభ దినం

1844 అక్టోబరు 2న గాజుల లక్ష్మీనర్సు శెట్టి హిందువుల  స్థితిగతులు మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్‌ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడె న్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్ర పుటల కెక్కింది. క్రెసెం ట్‌ను ప్రారంభి ంచింది  మద్రాసులోస్థిరపడ్డ తెలుగు వాడు కావడం విశేషం. గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ శ్రేష్టి (1806-1868) వ్యాపారి, భారత స్వాతంత్య్ర సమర యోధుడు, పౌరహ క్కుల నాయకుడు, రాజకీయ నాయకుడు. దక్షిణ భారత దేశంలో ఆంగ్ల విద్య ప్రారంభానికి కృషిచేసిన వారిలో అత్యంత ముఖ్యులుగా గుర్తించ బడ్డారు. మద్రాసు ప్రెసిడెన్సీలో హిందువుల అణచివేత, క్రైస్తవ మత మార్పిడులు, ప్రభుత్వ మత పక్షపాతాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన నాయకుడు.

19వ శతాబ్ది మధ్య భాగంలో, క్రైస్తవ మిషనరీలు బహిరంగ మత మార్పిడులను మద్రాసు ప్రెసిడెన్సీలోని ప్రజా సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో చేపట్టేవి. వారి మత మార్పిడి కార్యకలాపాలు బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ అధికారుల అండతో జరిగేవి. ఆ క్రమంలోనే బ్రిటీష్‌ అధికారులు ఉద్యోగాల్లో ఉన్నత పదవుల నియామకంలో స్థానిక క్రైస్తవులనే హిందువుల కన్నా ఎక్కువగా ఎంచుకునే వారు. ఈ చర్య ద్వారా హిందువులను క్రైస్తవం వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించే వారు. మద్రాసు ప్రభుత్వ మతవైఖరిని హిందువులు తరచుగా ఖండిస్తూండే వారు. వారిలో ఒకనిగా లక్ష్మీనర్సు హిందువుల వాదనను సమర్థిస్తూ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

మద్రాసు ప్రభుత్వం మద్రాసు విశ్వ విద్యాలయ విద్యార్థులకు బైబిల్‌ ‌ను ప్రామాణిక పాఠ్య గ్రంథంగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. విద్యార్థులను తరచుగా క్రైస్తవ మత సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలపై బోధించే వారు. క్రైస్తవ గ్రంథ భాగాల విజ్ఞానం లేని వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో తిరస్కరించే వారు. ఈ ప్రమాణాలను మద్రాసు ప్రెసిడెన్సీలోని హిందువులు వ్యతిరేకించారు. ఆంగ్ల విద్య లేకపోవడం వలన భారతీయులు చెన్నపట్టణములో ఆంగ్లేయ అధికారులతో అనేక కష్టాలు పడ్డారని గాజుల లక్ష్మీనర్సు శెట్టి భావించారు. చెన్నపట్టణంలో ఉన్నవారిదే సర్వాధికారమని భారతీయులు భావిస్తూ, ఇంగ్లండులో వారికి పై అధికారులు ఉన్నారనీ తెలియక అన్యాయాలకు గురయ్యారు. లక్ష్మీనర్సు శెట్టి  ఆ అన్యాయాల గురించి తెలుసుకొని వాటిని ఎదుర్కోవ డానికి చెన్నపట్టణ స్వదేశీ సంఘమును స్థాపించాడు. ఈ సంఘం యొక్క ముఖ్యోద్దేశం భారతీయులను ఆంగ్లేయుల అన్యాయాల గురించి చైతన్య వంతులను చేయడం.

1844 అక్టోబరు 2న లక్ష్మీనర్సు శెట్టి హిందువుల స్థితిగతులు మెరుగు పరిచేం దుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్‌ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్ర కెక్కింది. మద్రాసు రాష్ట్రంలో ఆంగ్ల పాలకుల దమన నీతిని నిరసిస్తూ, పక్ష పత్రిక ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేసే ప్రయత్నం సాగింది. ఐతే స్థాపన నుంచి, పత్రిక ప్రభుత్వం నుంచి గట్టి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. క్రిసెంట్‌ ‌పత్రిక గురించి ప్రభుత్వ ప్రచురణయైన ఫోర్ట్ ‌సెయింట్‌ ‌జార్జ్ ‌గెజిట్‌కు పంపిన ప్రకటన కూడా తిరస్కరించ బడింది. అనంతర కాలంలో, క్రైస్తవునిగా మత మార్పిడి పొందిన హిందువు తన పూర్వీకుల పరంపరా గతమైన ఆస్తిపై హక్కును కోల్పోడన్న చట్టం చేసేందుకు ప్రభుత్వం తీర్మానించింది.

ఈ ప్రయత్నాన్ని లక్ష్మీనర్సు శెట్టి నాయకత్వంలో హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తూ, గవర్నర్‌కు 1845 ఏప్రిల్‌ 9‌న మెమోరాండం సమర్పించింది. ఆందోళన కారులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రణాళి కలను గవర్నర్‌ ‌విరమించు కున్నారు. 1846 అక్టోబరు 7న పచ్చయప్ప కళాశాలలో జరిగిన నిరసన సమావేశానికి లక్ష్మీనర్సు శెట్టి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం మతవివక్ష, మత మార్పిడులకు ప్రభుత్వం అండగా వ్యవహరి ంచడం వంటివి నిరసిస్తూ ఓ మొమోరాండం బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ కోర్ట్ ఆఫ్‌ ‌డైరెక్టర్స్‌కు పంపుతూ తీర్మానించింది. వారి ప్రయత్నాలు సఫలీకృతమై క్రైస్తవ మత సిద్ధాంతాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చే ప్రయత్నాలు రద్దయ్యాయి.
  – రామ కిష్టయ్య సంగన భట్ల…
      9440595494 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page