ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు రాష్ట్రం పక్షాన పార్లమెంట్‌ ‌లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌ల తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వయంగా ఫోన్‌ ‌చేసి సమావేశానికి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *