- అసెంబ్లీలో చర్చ-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం
- స్పష్టం చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ అసె ంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తిని స్తోం దని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల అభ్యున్నతికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మద్ధతు ఇచ్చిందని, దళితులకు ఉన్నత పదవులు , అవకాశాలను కల్పించేందుకు ఎప్పటికీ పాటుపడిందని చెప్పారు. ముందుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీకి ప్రవేశ పెట్టారు.
ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే.. నేను సభలో ప్రకటన చేశా అని ఆయన వ్యాఖ్యానించారు.మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్‌కు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ -1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ••ప్-1లోని 15 ఉపకులాలను ఒకశాతం రిజర్వేషన్‌కు సిఫారసు చేసిందన్నారు.
గ్రూప్-1లోని 15 ఉపకులాల జనాభా 3.288శాతంగా ఉండగా.. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం సిఫారసు చేశామన్నారు. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాల జనాభా 62.748 శాతంగా ఉన్నారని.. గ్రూప్-3లోని ఎస్సీ ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినట్లు చెప్పారు. ఈ గ్రూప్-3లోని 26 ఉప కులాల జనాభా 33.963శాతంగా ఉన్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. వర్గీకరణకు ఆమోదం అనంతరం శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.