‌ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా..?

ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌
‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 05 : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ ‌రావు, పాడి కౌశిక్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలిం చారు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా రేవంత్‌ ‌సర్కార్‌పై ధ్వజమె త్తారు. ప్రభుత్వ  తప్పులపై ప్రశ్నిస్తే కేసులు..! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు..! చేస్తున్నారంటూ కేటీఆర్‌ ‌మండిపడ్డారు. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు.. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు..

ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు.. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు.. చివరకు ప్రజలపై కూడా కేసులు నమోదు చేసి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హింసిస్తోందని కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కాసులు మీకు కేసులు మాకు.. సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్‌ ‌రావు, జగదీష్‌ ‌రెడ్డి తోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం.. తక్షణం విడుదల చేయాలని కేటీఆర్‌‌ డిమాండ్‌ ‌చేశారు. చివరగా జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్‌ ‌నినదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page