కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు ఎవరి మధ్య ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ తెగలలో చూడవచ్చు. జన్యు పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపయోగ పడేలా కోయ సమాజంలో ఇప్పటికీ సజీవ సాక్షాలుగా సాక్షాత్కరిస్తున్నాయి అంటే వీరి జ్ఞానం ఎటువంటిదో చూడవచ్చు.
మాఘపున్నమి భారతదేశ ఆదివాసి తెగల సమూహాల్లో ఒక సాంస్కృతిక ప్రకృతి సంబంధాన్ని తెలిపే వారధి ఉత్తర భారత దేశంలో గంగానది ఒడ్డున కుంభమేలా నుండి మధ్య భారతదేశం ఆనుకొని సత్పుర పర్వతాలలో ఉన్న కచర్గడ్ కొండ గృహాల్లో కోయల ధర్మం తయారైన దగ్గరకి ఆ పక్కన తెలంగాణ గోదావరి లోయలో సమ్మక్క జాతర వరకు ఈ పున్నమికి ఆదివాసీలకు విడదీయలేని బంధం.. అందుకే ఇది ఆదివాసీల పవిత్ర మాసం ఇప్పపువ్వు కు కోలు కట్టి బొట్టు పెట్టి దైవంగా కొలిచే ఒక పవిత్ర సంబంధం.. ఈ విధానం జూన్ లో మొదటి కొత్త నీరు( భూ గర్భ జలం) పడే వరకు కోయల మహా జాతరలు ఎన్నో చూడవచ్చు. ఆ క్రమంలో ఆదివాసీల చారిత్రక ప్రాచీనత ఎలాంటిదో ఒకసారి చూద్దాం.
భూమి పుట్టుక సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.
మన పూర్వీకులు కొన్ని మిలియన్ సంవత్సరాలుగ ఉన్నప్పటికీ, ఆధునిక మానవులుగా క్రీస్తు పూర్వం 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే మానవ పరిణామ క్రమం చెందినారు అని చెప్పవచ్చు. అంటే ఆధునిక మానవుల కంటే ముందు ఉన్న సమూహాలు, తెగలు భూమ్మీద ఉన్నాయి. అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే ఈ దేశానికి మూలవాసులుగా ఆదివాసీలను పిలుస్తున్నారు. అదే నిజం కూడా ..! అందులో ముఖ్యంగా కోయ అధిమ సమూహాల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ప్రపంచం లో అనేక ప్రాచీన నాగరికతలలో కనిపిస్తున్నది. ఇప్పటికీ పండగలు, వేల్పులల జాతర లలో చిత్రలిపి లో డాలు గుడ్డ లిపి లో లేదా రాతి విగ్రహాలపై రాక్ పెయింట్స్ పై వారి జీవనం లో ప్రతి దశ లో కనిపిస్తుంది. ప్రపంచ లో ఉన్న గొప్ప నాగరికత గా చెప్పబడే సింధు లోయ మొహంజదారో, హరప్పా నాగరికత తవ్వకాలలో లభ్యమైన అతి ప్రాచీన వస్తువులకు లిపి కి అనుసంధానం చేస్తూ కూడ సమ్మక్క, సారలమ్మ ఆర్కియాలజీ మరియు ఇండి జినస్ రిసేర్చ్ ఇనిస్ట్యూట్ బృందం వారు గుర్తించడం జరిగింది.
వాటి అర్ధాలను తెలుసుకోవడం, ఆచరిస్తున్న సాంప్రదాయాలు, పోలికలు తేడా లేదనే విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది.
అంటే కోయ సమాజం సామాజికంగా వెనక పడ్డది అని పిలవబడుతున్న సందర్భంలో ప్రకృతితో మమేకమైన తీరు అడవి, నీరు, జంతువులు, భూమి తమ తోబుట్టువులు గా చూసే విధానం ఇప్పటికి వీరి జీవితాలలోకి కనపడుతుంది, వీరి ప్రకృతి జ్ఞానం కనబడుతుంది. అనేక క్లిష్ట పరిస్థితులను కాలం విసిరే విధ్వంసం సవాళ్ళను ఎదుర్కొని తమ సంస్కృతిని కాపడుతున్న తీరు నేటి సమాజ పరిస్థిలలో అత్యంత విలక్షణమైనది, ఆధునిక యుగానికి పూర్వం నుండి అదే కట్టుబాటును తమ భవిష్యత్ తరాలకు అందిస్తూ నేటి కాలంలో చేజారుతున్న తమ జాతి ఆనవాళ్లను పాట రూపేనా, నాట్యం రూపేనా, భాష రూపేనా, సాంస్కృతి జాన పద సాహిత్య రూపంలో తమ, ఇలవేల్పును ఈ ఆధునిక జగతిలో నిలబెట్టే తీరు ఈ ప్రపంచం చూడని మరో కోణం. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు ఆదివాసీ చరిత్ర .. ఇది వారి జీవనం లో మిళితమై సాగుతున్న వర్తమానం ప్రవాహం, ముందు తరాలకు అందె భవిష్యత్ జ్ఞాన భాండగరమే.
కోయ సమాజం లో వంశ వృక్షాలను రూపొందించిన అతి ముఖ్యమైన వ్యక్తి బేరంబోయిన రాజు, భార్య వరందేవి. వీరిది దక్షిణ ప్రాంతం ఏరుగట్ల పట్టణం. వరందేవికి సంతానం ఆరుగురు కొడుకులు, ఆరుగురు బిడ్డలు. మొట్టమొదట వరుస వాయి క్రమాన్ని తయారు చేసింది బెరంబోయిన రాజు తమ ఒక్కొక్క కూతురిని ఒక గట్టుకు వియ్యం అందిస్తూ వారి గట్టు విశిష్టతను వివరిస్తూ దానిని పరిరక్షించుకునే బాధ్యతను అందరికీ అందించడం జరిగింది. అలా 3 నుండి 7 గొట్లు ఏర్పాటు చేశాడు. అందుకే బేరంబోయినరాజును పెద్ద దిక్కుగా తలుస్తారు. అప్పటినుండి ఇప్పటివరకు మిగతా గోట్లు, గోత్రపు వాళ్లు వీళ్ళ మధ్య వరస సంబంధాన్ని వంద సంవత్సరాలు పరిచయం లేని వారిని కూడా గట్టు గోత్రంతో తమకు వారు ఏమి అవుతారు స్పష్టంగా వివరించవచ్చు.
ఇప్పటికీ కూడా కోయ సమాజంలో దీని వంశ ఉనికిని కొనసాగిస్తున్నారు. సమ్మక్క తల్లి పెళ్లి మాఘ శుద్ధ పౌర్ణమికి జరుగుతుంది. ఈ పున్నమి తరువాత నే కోయ సమాజం లో పెళ్లి లు జరుగుతాయి.. ముందు చేయటానికి వీలు లేదు. ఈ జాతర తరువాత నే వేల్పులు గొలుసు కట్టులాగ ఒకదాని తర్వాత ఒకటి జాతర జరి గుతాయి. ఇప్పటికీ ఈ పున్నమి కి ఉన్న ప్రత్యేకతను పూర్వం నుండి కోయ సమా జం కొనసాగిస్తున్న వస్తున్నారు ఇక్కడ మనం గమనించవచ్చు. సమ్మక్క జాతర తరువాత ముఖ్య మైన జాతర బేరంబోయిన రాజు వంశానికి చెందిన కొమరం వారి వేల్పు రెక్కల రామక్క జాత రను తమ అస్తిత్వాన్ని పునికి పుచ్ఛి అంది పట్టుకొని నేటి సమాజంలో కూడ మతాల కంటే పూర్వమైన జాతరగా ఈ ఆధునిక కాలంలో చూడవచ్చు. ఈ మాఘ మాసంతో పెనవేసుకొని ఉన్నది, అత్యంత పవిత్రమె •నదిగా భావిస్తారు.
కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న వీరిలో ముఖ పరి చయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు ఎవరి మధ్య ఇచ్చి పుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ తెగలలో చూడవచ్చు. జన్యు పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేం దుకు ఉపయోగ పడేలా కోయ సమాజంలో ఇప్పటికీ సజీవ సాక్షాలుగా సాక్షాత్కరిస్తున్నాయి అంటే వీరి జ్ఞానం ఎటువంటిదో చూడవచ్చు.
భారతదేశంలోని నాగరికత లన్నీ కూడా 100 సంవత్సరాలుగా దేశ విదేశా చరిత్రకారులు కూడా చదవలేని విధంగా రూపుదిద్దుకొని ఉన్నాయి. వీటి రహస్యన్ని చేదించలేని చిక్కు ముడి ల ఉంది. కానీ ఇదీ కోయల ఆస్తిత్వం, సాంస్కృతిక మనుగడను వేల సంవత్సరాల నుండి మాఘ మాసంలో ప్రతి సంవత్సరం సాంస్కృతిక ఉద్యమంగా పురుడు పోసుకుంటూ వస్తుంది.అనేక నాగరికతలతో ఏదైతే ఉందో ఆ సంస్కృతిని వేల్పుల, పండగల రూపం లో బ్రతికించుకోవడం అపురూపమైన అంశాభూతమై జాతరుల రూపంలో పరిడావిల్లుతూ అడవికాసిన వెన్నెలల ఆదివాసీ జ్ఞానజ్యోతులు ప్రజ్వరీల్లుతూ ప్రపంచం ముందుకు రావడానికి వేల సంవత్సరాల కృషి, శ్రమ పండగల రూపంలో నెలకొల్పిన విశేషమైన జ్ఞాన సమూహం. అందుకే ప్రకృతి ఒడిలో మాఘపున్నమి వెలుగులో ఓలలాడుతూ తమ వారసులకు అందె వరమే మాఘ పున్నమి అందుకే ఈ పున్నమి ని కోయ పున్నమి అని కూడ మధ్య భారత దేశం లో సంబోధిస్తారు.
– తిరుమల రావు మైపతి
సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ