మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా..
చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే..
గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు
ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు..
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం మోపుతుంది. అందులోభాగంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైడ్రాపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. హైడ్రా పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఆయన మండిపడ్డారు. హైడ్రాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో  ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప.. తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్‌, ‌చుట్టు పక్క ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు.

హైదరాబాద్‌లోని చెరువులు ప్రజల ఆస్తి అన్నారు. హైదరాబాద్‌ అం‌టేనే రాక్స్, ‌లేక్స్, ‌పార్క్స్‌.  ఇవి హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. నగరంలో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీని ఆధునికీకరించాలని గతంలో చాలా యత్నాలు జరిగాయి. శాటిలైట్‌ ‌మ్యాప్‌ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామ‌ని భట్టి వివరించారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇప్పుడెన్ని ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నాం. హైడ్రాను తీసుకొచ్చింది సీఎం కోసమో, మంత్రుల కోసమో కాదు కదా. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కొత్త నిబంధనలు తెచ్చుకున్నాం. చెరువులను భవిష్యత్‌ ‌తరాలకు అందించాల్సి ఉందని భట్టి వివరించారు. ఇప్పటికైనా చెరువుల ఆక్రమణ ఆపాలి. మూసీలో మంచినీళ్లు లేకుండా డ్రైనేజీగా మార్చేశాం. గతంలో ఇతర దేశాల్లోనూ నదులు డ్రైనేజీల్లా ఉండేవి.. వాళ్లు మార్చుకున్నారు. ఇతర దేశాలు నదులను ఆస్తులుగా మార్చుకున్నాయి. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. టెండర్లే పిలవకుండా రూ.లక్షన్నర కోట్లు అవుతుందని ఎలా చెబుతారు? మూసీ సుందరీకరణ అంశంపై ప్రతిపక్షాలు తమ ఆలోచనలు మాకు తెలియజేయాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలిగించం. ఇళ్లను తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నాం. కూలగొట్టిన ఇళ్ల కంటే మెరుగైన ఇళ్లను ఇస్తున్నాం.

ప్రజలకు మేలు జరగకూడదనేదే ప్రతిపక్షాల అజెండా. హైదరాబాద్‌ను గ్లోబల్‌ ‌సిటీగా మార్చేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి. పరిపాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని భట్టి అన్నారు. అలాగే నగరానికి మూసి నది మణిహారంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. నగరంలో చాలా చెరువులు, పార్కులు, కబ్జాకు గురయ్యాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా కబ్జాలతో హైదరాబాద్‌లో చెరువులు మాయమైనాయని అన్నారు. మూసి నది పరీవాహక ప్రాంతంలో అక్రమణలను సైతం రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌తొలగిస్తుంది. ఆ క్రమంలో పేదలు, మధ్యతరగతి వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో విపక్షాలు సైతం స్పందించాయి. అందులోభాగంగా రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌సైతం స్పందించారు. అందులోభాగంగా రేవంత్‌ ‌రెడ్డికి ఆదివారం ఎంపీ ఈటల బహిరంగ లేఖ రాశారు.  లేఖలో హైడ్రా పేరుతో రేవంత్‌ ‌సర్కార్‌ ‌దూకుడు ద వెళ్తుందంటూ ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌సైతం హైడ్రాపై కీలక ఆరోపణలు చేశారు. మరో విపక్షం బీఆర్‌ఎస్‌ ‌నేతలు అయితే.. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కపై విధంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *