ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగి స్తుంది. జస్టిస్‌ ‌బిఎస్‌ ‌చౌహాన్‌ ‌నేతృత్వంలోని లా కమిషన్‌ ‌తన నివేదికలో రాజ్యాంగం యొక్క ప్రస్తుత నిర్మాణం ప్రకారం ఏకకాలంలో ఎన్నికలు నిర్వహి ంచడం సాధ్యం కాదని పేర్కొ ంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, లోక్‌సభ, అసెంబ్లీల విధివిధానాలకు తగిన సవరణలు అవసరమని పేర్కొంది.’’

 ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోది ంచడ ంతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ లలో ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుం టున్నది. ప్రజాస్వామ్యవాదులు చర్చకు ఉపక్రమి ంచగా, మేథావులలో మేథోమధనం మొదలైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శరవేగంగా జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధపడుతుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు దేశానికి వరమా? శాపమా? పరిశీలిద్దాం.
ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఏకకాల ఎన్నికల ఆలోచన భారతదేశానికి కొత్తేమి కాదు. స్వాతంత్య్రానంతరం మొదటి ఇరవై సంవత్సరాల పాటు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు కలిపి జరిగాయి. అయితే, 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు,1970లో పార్లమెంటు రద్దు కావడంతో 1971లో జరిగిన సాధారణ ఎన్నికల  వల్ల ఈ ప్రక్రియకు విఘాతం కలిగింది. ప్రస్తుతం లోక్‌ ‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావడం, లేదా శాసన వ్యవస్థలు ముందస్తుగా రద్దు కావడం అనేది అన్ని శాసన వ్యవస్థ లకు ఏక రీతిగా లేకపోవడం వల్ల కాలానుగుణంగా వేటికవే వేరువేరుగా ఎన్నికలు నిర్వహించ బడుతు న్నాయి.
మొత్తం మీద దేశంలో సగటున ఏడాదికి 5 నుంచి 7 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల తలెత్తే సమస్యల కారణంగా రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఎన్నికల సంఘం సూచించింది. 1999లో జస్టిస్‌ ‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ ‌కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ 79వ నివేదిక సైతం ఏకకాల ఎన్నికల నిర్వహణకు తన మద్దతును పునరుద్ఘాటించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను 2016లో ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెచ్చారు. అధికార ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ బలమైన వాదనను వినిపిస్తూ వస్తున్నది. 2017లో ఏకకాల ఎన్నికలపై వర్కింగ్‌ ‌పేపర్‌ను నీతి ఆయోగ్‌ ‌తయారు చేసింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కోసం కనీసం ఐదు రాజ్యాంగ మార్పులు అవసరమని పేర్కొంటూ లా కమిషన్‌ ‌కూడా 30 ఆగస్ట్ 2018 ‌న వర్కింగ్‌ ‌పేపర్‌ను రూపొందించింది.
దేశంలోని రాష్ట్రాలు అసెంబ్లీ గల కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 4120 ఎమ్మెల్యేలు ఉన్నారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కోసారి దాదాపు వందల కోట్లు ఖర్చు అవుతోంది. ఏర్పాట్లు, జీతాలు మరియు సెక్యూరిటీల కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయబడుతుంది. ఈ గ్రాఫ్‌లో ఎన్నికల ఖర్చులు కొన్నేళ్లుగా పెరుగుతున్నట్లు చూపు తోంది. 2014 నుండి 2022 వరకు జరిగిన 50 అసెంబ్లీ ఎన్నికలకు ఏడు వేల కోట్లు ఖర్చయిందని కేంద్రం వెల్లడించింది. కాగా సెంటర్‌ ‌ఫర్‌ ‌మీడియా స్టడీస్‌ ‌నివేదిక ప్రకారం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చు రూ. 60,000 కోట్లకు పెరిగిందని వెల్లడిం చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రాతినిధ్య ప్రభు త్వాన్ని ఎన్నుకునే సమయంలో ఖర్చును పరిగణలోనికి తీసుకోరాదని, అధిక ఖర్చు వస్తుందని భావిస్తే ఐదు సంవత్సరాలకు బదులు పది, ఇరవై సంవత్సరాల కొకసారి ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్నారు.
అంతేకాక జోర్డాన్‌ ‌సౌదీ అరేబియా లాంటి దేశాల మాదిరిగా రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇజ్రాయిల్‌, ‌జపాన్‌ ‌లాంటి దేశాలలో తరచూ ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా కాలం పాటు పోలింగ్‌ ‌మరియు భద్రతా సిబ్బంది నిమగ్నమవ్వడం వల్ల సమయం వృధా కావడమే కాకుండా ప్రభుత్వోద్యోగుల విధుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతు న్నాయి. దానికి తోడు నిరంతరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూ ఉండడం మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్ అమలులో ఉండడంవల్ల ప్రజా సంక్షేమం కోసం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబడకపోగా జరగు తున్న అభివృద్ధి పనులు నత్త  నడకన నడుస్తున్నాయని వాదిస్తున్నారు. ఏకకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనా దక్షత పెరగడమే కాకుండా ద్వేషపూరిత ప్రసంగాలు, హింస మరియు ఇతర శాంతిభద్రతల సమస్యలలో గణనీయమైన తగ్గింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అంతేకాకుండా నల్లధనం తోనే ఎన్నికలు జరుగుతాయన్నది బహి రంగ రహస్యం.
దేశంలో ఎన్నికల సమయంలో భారీ నల్లధనం తెల్లధనంగా మారుతున్నదని ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే సమాంతర ఆర్థిక వ్యవస్థపై దాడి చేసినట్లవుతుందని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న కొన్ని సంస్థలు చెబుతున్నాయి. అయితే రాజకీయ నాయకుల వద్ద ఉన్న నల్లధనం ప్రజలకు పంపిణీ చేయబడితే అది ప్రజల జీవన కొనుగోలు శక్తిని, జీవనశైలిని మారుస్తుందని సామ్యవాదులు అంటున్నారు. నిరంతరము ఎన్నికలు జరుగుతూ ఉంటే నిత్యవసర వస్తువుల ధరలు కూడా నియంత్రణలోనే ఉంటాయని ప్రత్యేకించి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి. తరచూ ఎన్నికలు జరుగుతూ ఉన్నందున ఉచిత పథకాలకు రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. వోటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారు తున్నదని, కొన్నిసార్లు ఆర్థిక సంక్షోభంలో కూరు కుపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83(2),172 ‌వరుసగా లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఐదేళ్లుగా నిర్దేశిస్తున్నాయి. గడువు ముగియక ముందే అధికార పార్టీ విశ్వాసం కోల్పోతే మళ్లీ ఎన్నికలు వస్తాయా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనేది తేల్చాలి. ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించ బడుతునందున ‘ఒకే’ అనే ఊహ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగి స్తుంది. జస్టిస్‌ ‌బిఎస్‌ ‌చౌహాన్‌ ‌నేతృత్వంలోని లా కమిషన్‌ ‌తన నివేదికలో రాజ్యాంగం యొక్క ప్రస్తుత నిర్మాణం ప్రకారం ఏకకాలంలో ఎన్నికలు నిర్వహి ంచడం సాధ్యం కాదని పేర్కొ ంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, లోక్‌సభ, అసెంబ్లీల విధివిధానాలకు తగిన సవరణలు అవసరమని పేర్కొంది.
దీని కోసం కనీసం 50% రాష్ట్రాల నుండి ఆమోదం పొందాలని కమిషన్‌ ‌సిఫార్సు చేసింది, ఇది అంత తేలికైన పని కాదు. వోటర్లు తమ వాణిని పదే పదే వినిపించేందుకు అవకాశం కల్పిస్తున్నందున, తరుచుగా జరుగుతున్న ఎన్నికల విధానం ప్రజా స్వామ్యంలో ఒక ప్రయోజనంగా పరిగణిం చబడుతుంది. జాతీయ మరియు రాష్ట్ర ఎన్నికల యొక్క అంతర్లీన అంశాలు విభిన్నంగా ఉన్నందున ఎక్కువ జవాబుదారీతనం నిర్ధారిస్తుంది. 2015లో ఐడిఎఫ్సి ఇన్‌స్టిట్యూట్‌ ‌నిర్వహించిన ఒక అధ్యయ నంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల గెలిచిన రాజకీయ పార్టీ లేదా కూటమి లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో విజయం సాధించే అవకాశం 77% ఏర్పడుతుందని కనుగొంది. ఎన్నికల సంఘం మరియు నీతి అయోగ్‌ ‌నివేదిక ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణకు ఒక్కో వోటరుకు సంవత్సరానికి రూ.10 ఖర్చు అవుతుందని, అదే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో ఓటరుకు ఏడాదికి రూ.5 ఖర్చు అవుతుందని తేలింది.
ఏకకాల ఎన్నికల ఆవశ్యకత మరియు సాధ్యాసాధ్యాలపై అన్ని రాజకీయ పార్టీలు మరియు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. విస్తృత సంప్రదింపులు మరియు చర్చల ద్వారా ఏకకాల ఎన్నికలను సాధ్యం చేయడానికి, రాజ్యా ంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 మరియు లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల విధివిధానాల నియమాలను సవరించడం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ, కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఏకకాలంలో ఎన్ని కలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సవాళ్ల గురించి విస్తృత చర్చ జరగాలి. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే సమ తుల ఆహారం ఎలా అవసరం పడుతుందోప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా పరిపుష్టిగా ఆరో గ్యంగా ఉండాలంటే విభిన్న ఆలోచనలు ఉన్న బహుపక్షిక రాజకీయ పార్టీలు ఆవశ్యకం. తద్వారా ప్రశ్నించేతత్వం బలపడి ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. అందువల్ల ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని నిర్ణయించుకునే అవకాశం దేశం మొత్తానికి ఇవ్వాలి.
image.png
భాస్కర్‌ ‌యలకంటి
సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
సెల్‌: 8919464488

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *