శోక నగరాన్ని సందర్శించండి

రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు పోస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌5: హైదరాబాద్‌కు వొస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా అశోక్‌నగర్‌ వెళ్లాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.  హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను కలవాలని.. ఆ యువత పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో చూడాలంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్టు చేశారు. ఇటీవల గ్రూప్‌`1 విద్యార్థుల ఆందోళనలతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో తీవ్ర హైటెన్షన్‌ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జీవో నెంబర్‌ 29ను రద్దు చేసి జీ.ఓ. నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.

పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పాటు అరెస్ట్‌లు చేశారు. పలు చోట్ల లాఠీచార్జ్‌లు కూడా జరిగాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప‌ర్య‌ట‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. అశోక నగరాన్ని సందర్శించండి రాహుల్‌ గాంధీ.. విూరు ఎన్నికల ముందు అశోక్‌ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో`కాల్డ్‌ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్‌ చేసి వీపులు పగలగొట్టింది. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్‌ నగర్‌ను సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి.. వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడాల‌ని ఎక్స్‌లో హరీష్‌రావు పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *