విదేశీ పర్యటనలపై పన్ను అంటూ కథనాలు

– ఓ టీవీ ఛానల్ కథనంపై మోదీ స్పందన
– అలాంటిదేమీ లేదంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్

న్యూదిిల్లీ, మే 16 : విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జి విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజం లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా ఘర్షణలతో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ అంతకంతకూ పతనం అవుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం విదేశీ పర్యటనలపై తాత్కాలికంగా పన్ను విధించేందుకు యోచిస్తోందని సీఎన్‌బీసీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనంపై ప్రధాని ఘాటుగా స్పందించారు. ’ఇది పూర్తిగా అసత్యం. విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించే ప్రశ్నే లేదు. వ్యాపార నిర్వహణ, ప్రజల జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము అని ప్రధాని స్పష్టతనిచ్చారు. ప్రధాని పోస్టు తరువాత ఆ వార్తా ఛానల్ కూడా తన కథనాన్ని ఉపసంహరించుకుంది. తమ కథనంలో కచ్చితత్వం లోపించిందని అంగీకరించింది. ఈ తప్పిదానికి విచారం వ్యక్తం చేస్తున్నామంటూ ‘ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దేశంలో ఇంధన రంగంలో గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని శుక్రవారం యÖఏఈలో పర్యటించారు. భారత్‌లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి యూఏఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశీయ ఇంధన రంగ భద్రత, ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ దిశగా ఈ ఒప్పందం కుదిరింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *