మహానిమజ్జనానికి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు

రంగంలోకి 15వేల మంది సిబ్బంది
రోడ్లపై చెత్తవేయొద్దన్న కమిషనర్‌ ఆమ్రపాలి

మహా నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.వినాయక  నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 465 క్రేన్స్‌, హుస్సేన్‌ సాగర్లో 38 క్రేన్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్‌ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు.

 

రేపటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అసలైన పని ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 160 గణెళిష్‌ టీమ్స్‌ పనిచేయనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.

 

నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్‌, పెద్ద చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. అలాగే మూడు రోజులపాటు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎల్లుండి వర్కింగ్‌ డే అని ఆలోపు నిమజ్జనం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *