ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ జవాన్‌ను రాయ్‌పూర్‌ ‌తరలించారు. మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో కమాండో టీమ్‌ , ‌సిఆర్‌పిఎఫ్‌ ‌బృందం సంయుక్తగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో సుమారు 60 మంది పోలీస్‌ ‌బలగాలు కూంబింగ్‌కు వెళ్ళినట్లు తెలుస్తుంది. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీస్‌ అధికారులు నిమగ్నమ‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *