మాట్లాడనున్న సునీతా విలియమ్స్
వాషింగ్టన్,సెప్టెంబర్10: బోయింగ్ స్టార్లై నర్ వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ నున్నారు. కాగా స్టార్‌లైనర్ స్పేస్‌క్రాప్ట్‌లో సమస్య తలెత్తడంతో వారు అంత రిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13న ఎర్త్ టు స్పేస్ కాల్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మాట్లాడ నున్నట్లు నాసా వర్గాలు వెల్లడిం చాయి. వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, ఇందు కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఈ మిషన్‌లో భాగంగా వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను వ్యోమగాములు ప్రజలతో పంచుకుంటారని నాసా అధికారులు తెలి పారు.
ఐఎస్ఎస్లో ఉన్న ప్రయోగశాలలో వారు చేస్తున్న శాస్త్రీయ పరిశోధనల గురించి వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావా ల్సిఉండగా.. స్టార్‌లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదుర య్యాయి.
దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమ గాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. సాంకేతిక సమ స్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమ గాము లను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షి తమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది.