భారత దేశానికి స్వాతంత్య్రం వొచ్చి 75 యేళ్లు అయింది. ఇంకా పేద దేశంగానే మిగిలింది. 2013బి2014 లో తొమ్మిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇపుడు అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది . ప్రపంచంలో ఉన్న18 శాతం జనాభా భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఆశించినట్లు తలసరి ఆదాయం పేరుగలేదు. జనాభా వద్ధిరేటు పెరిగిన నిష్పత్తిలో తలసరి ఆదాయం పెరగలేదు. 2013-2014 సం. రాలలో తలసరి ఆదాయ పరంగా 189 దేశాల జాబితాలో భారత దేశం 147 వ స్థానంలో నిలిచింది. 2022బి23 నాటికి141 స్థానానికి చేరింది. ప్రజల తలసరి ఆదాయం’ కొనుగోలు శక్తి పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. విద్య ‘వైద్యం జీవన ప్రమాణాలతో గణనీయమైన ప్రగతి సాధిస్తేనే భారత్ ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
విద్య వైద్యం అందుబాటులో ఉండాలి : భారత దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్సిడీలు వంట గ్యాస్, విద్యుత్ లభ్యం కాని వినియోగారుల సంఖ్యను తగ్గించినట్లు నీతి ఆయోగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.దీన్ని ఆధారంగా పేదరికం తగ్గిందని చెప్పడం సరైంది కాదు.దీర్ఘకాలంలోపేదరికాన్ని తగ్గించే విద్యవైద్యరంగాల లో ఆశించిన పెరుగుదల లేక పోవటం గమనార్హం. విద్య వైద్య రంగాలలో అభివృద్ధి సాధిస్తేనే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. భారత్ ఆర్థిక రంగములో వృద్ధి సాధించినప్పటికీ . మహిళలు బాలలు అల్ప పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం లోపం వల్ల 38.4 శాతం బాలలో ఎదుగుదల లేదు . రక్తహీనత అంధత్వం బాలల పాలిట శాపలుగా పరిణమించాయి. బాల కార్మికుల చేత పనిచేయించడం’ భిక్షాటన చేయించడం. వేశ్య వృత్తిలో ఎక్కువ బాలికలు ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పోషకాహార లోపం: పౌష్ఠికాహారంలోపం సమతుల ఆహారం మహిళలకు బాలలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడు. సమతుల ఆహారం తీసుకోక పోవడం వల్ల వారు అనేక రోగాల బారిన పడి అనారోగ్యానికి గురి అవుతున్నారు.
శిశు మరణాలు..బాలికల శాతం ఎక్కువ: భారత్ లో శిశు మరణాల రేటు బాలుర కంటె బాలికల్లో ఎక్కవ శాతం ఉంది. పుట్టిన బాలికలు ఐదేళ్ల లోపు 11 శాతం పైగా మరణిస్తున్నారు. 60బి90 శాతం బాలికలు ‘మహిళలు బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేదింపులకు గురి అవుతున్నారని అనేక నేర పరిశోధనలో వెళ్ళడైంది. ప్రపంచ ఆరోగ్యభద్రత సూచి: భారత్ స్థానం ప్రపంచ ఆరోగ్య భద్రత సూచీ వివిధ దేశాల ఆరోగ్య స్థాయిని అంచనా వేసింది. ప్రపంచంలోని 195 దేశాల్లో భారత్ (మన దేశం) ,66 వ స్థానం దక్కించుకుంది. విద్య -వైద్య రంగాల నిర్లక్ష్యం: భారత దేశ ప్రభుత్వం విధ్య ‘వైద్య రంగాల మీధ బడ్జెట్ లో 3శాతాన్ని మించి ఖర్చు చేయలేదు. విద్య ‘వైద్య రంగాలలో మౌలిక.వసతుల కొరత రాజ్యమేలుతుంది. కేంద్ర రాష్ట్ర’ ప్రభుత్వాలు అవలంబించిన విద్యా విధానం విద్యాలయాలు ఉద్యోగ యోగ్యత లేని పట్టభద్రులు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా విలసిల్లు తున్నాయి..ఆరోగ్య రంగానికి 2 శాతం లోపు నిధులు కేటాయించారు. విద్యా రంగానికి బడ్జెట్ ల్లో 2.5 శాతం మాత్రమే కేటాయించారు. ఏనాడు జి.డి.పిలో విద్యారంగానికి 6 శాతం కేటాయించలేదు.
వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించాలి: దేశములో పేదరికానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం నేటికి అందుబాటులో లేదు . 2014 లో భారత ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది. అప్పటి నుండి పేదరికానికి సంబంధించిన సమాచారం లభించడం లేదు. ప్రతి ఐదేళ్లకు ఒక సారి పేదరికపు స్థాయిలను అంచనా వేసే వినియోగ వ్యయ సర్వేలను నిర్వహించక పోవడం వల్ల పేదల సంఖ్య తెలియడం లేదు. 2011-12 వినియోగ వ్యయ సర్వే ఆధారంగానే పేదరికాన్ని అంచనా వేస్తున్నారు ఈ సర్వే ప్రకారమే నిధులు కేటాయిస్తున్నారు. జనాభా పెరిగిన దామాషా లో నిధుల కేటాయింపు జరుగక పోవడం వల్ల పేదరిక నిర్మూలన సవాల్ గా పరిణమించింది. వినియోగ వ్యయ సర్వేల ఫలితాలు 2024 లోక సభ ఎన్నికల తర్వాత అందుబాటులోకి వొస్తాయని నిపుణులు భావిస్తున్నారు.అప్పుడే దేశములో జనగణన జరుగుతుంది. పేదల సంఖ్య కచ్చితంగా తేల్చాలి. అప్పుడు మాత్రమే పేదల లెక్క ప్రకారం వారి జనాభా అవసరాల ప్రాతిపదికన రూపొందించ బడిన పథకాలు అమలు చేస్తే పేదరికం తగ్గి పేదల ఉద్ధరణ సాధ్యమౌతుంది. దారిద్య్ర రేఖకు దిగువన జీవించే జనాభాను తగ్గించాలి. పేదల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచాలి .
ప్రభుత్వం సామాజిక సంరక్షణ చర్యలు చేపట్టాలి: ప్రభుత్వాలు లింగ సమానత్వం ‘విద్యా ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు సామాజిక రక్షణ చర్యలు చేపట్టాలి . లివాతావరణ మార్పులు అనుకూలమైన ఉత్పత్తి విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం ‘గ్రామీణాభివృద్ధి వాతావరణంలో సంభవించే మార్పులకు అనుకూలమైన ఉత్పత్తి విధానాలు చేపట్టాలి.
పేదలు స్వశక్తితో సంపద సృష్టి: ప్రభుత్వం పేదలు తమకు తాముగా స్వశక్తితో సంపద సృష్టించుకునే అవకాశాలు కల్పించాలి. సామాజిక సంస్థాగత దుర్వినియోగాన్ని అంతం చేస్తూ ‘ సమ్మిళిత అభివృద్ధి ద్వారా ప్రజల సమిష్టి డిమాండ్ పెంచే దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చెయ్యాలి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ‘ఉత్పాదకత ‘ఉపాధి పెట్టుబడి ‘ వనరుల అభిలషణీయ వినియోగం’ వనరుల కేటాయింపు పంపిణీకి పెద్ద పీట వేసే బహుముఖ వ్యూహాలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను అమలు చెయ్యాలి.
-నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకానమిక్ ఫోరం
కరీంనగర్, సెల్ : 9440245771





